NV Ramana : ‘సుప్రీం’కు ముస్లిం వ్య‌తిరేక ప్ర‌సంగాలు

ముస్లింల‌కు వ్య‌తిరేకంగా జ‌రుగుతోన్న ప్ర‌చారాల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సుప్రీం కోర్టులోని 76 మంది న్యాయ‌వాదులు క‌లిసి చీఫ్ జ‌స్టిస్ కు రాత‌పూర్వ‌క విన‌తి ప‌త్రాన్ని అందించారు. తక్షణ న్యాయపరమైన జోక్యం అవసరమ‌ని వాళ్లు డిమాండ్ విజ్ఞ‌ప్తి చేశారు. ముస్లిం వ్యతిరేక ద్వేషపూరిత ప్రసంగాలను ఫిర్యాదులో జోడించారు.

  • Written By:
  • Publish Date - December 27, 2021 / 05:03 PM IST

ముస్లింల‌కు వ్య‌తిరేకంగా జ‌రుగుతోన్న ప్ర‌చారాల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సుప్రీం కోర్టులోని 76 మంది న్యాయ‌వాదులు క‌లిసి చీఫ్ జ‌స్టిస్ కు రాత‌పూర్వ‌క విన‌తి ప‌త్రాన్ని అందించారు. తక్షణ న్యాయపరమైన జోక్యం అవసరమ‌ని వాళ్లు డిమాండ్ విజ్ఞ‌ప్తి చేశారు. ముస్లిం వ్యతిరేక ద్వేషపూరిత ప్రసంగాలను ఫిర్యాదులో జోడించారు. డిసెంబర్ 17న ఢిల్లీలో హిందూ యువ వాహిని నిర్వహించిన స‌భ‌ను ప్ర‌స్తావించారు. అలాగే డిసెంబర్ 19న హరిద్వార్‌లో యతి నర్సింహానంద సరస్వతి నిర్వహించిన స‌భ‌లోని ప్ర‌సంగాల‌ను లేఖ‌లో కోడ్ చేశారు. ఈ ఘటనలపై సుమోటోగా విచారణ చేపట్టాలని న్యాయవాదులు తమ లేఖలో సీజేఐ రమణను కోరారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 120బి, 121ఎ, 124ఎ, 153ఎ, 153బి, 295ఎ, 298 ప్రకారం చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు కోరారు. గతంలో కూడా ఇలాంటి హింసాత్మక ద్వేషపూరిత ప్రసంగాలు జరిగాయి, కానీ “ప్రభావవంతమైన చర్యలు తీసుకోబడలేదు అనే విష‌యాన్ని పేర్కొన్నారు.
భార‌త‌దేశ సార్య‌భౌమాధికాన్ని దెబ్బ‌తీసేలా ఆ స‌భ‌ల్లోని ప్ర‌సంగాలు ఉన్నాయ‌ని లేఖ‌లో న్యాయ‌వాదులు పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ స్వాతంత్ర్యం, బహుళ సాంస్కృతిక దేశం యొక్క పనితీరును చాటేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీజేఐని కోరారు.