Site icon HashtagU Telugu

Notification:యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

Upsc Cse Notification 2024 Notification Of Upsc Civil Services Examination Released

Upsc Cse Notification 2024 Notification Of Upsc Civil Services Examination Released

 

UPSC CSE Notification: ఇండియన్‌ సివిల్‌ సర్వీసుల్లో 1,056 పోర్టుల భర్తీకి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ (CSE) పరీక్షకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. బుధవారం నుంచి వచ్చే నెల మార్చి 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ప్రిలిమినరీ పరీక్ష మే 26న, మెయిన్స్ అక్టోబర్ 19న జరుగనున్నది. దాంతో పాటు ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ (IFS)లో 150 పోస్టు భర్తీకి సైతం ప్రత్యేకంగా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుంచి బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 21-32 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే, రిజర్వేషన్ల ఆధారంగా మినహాయింపు సైతం ఉంటుంది. ఓబీసీ, ఇతర అభ్యర్థులకు రూ.100 చెల్లించాలి. మహిళలు, ఎస్టీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

కాగా, సివిల్‌ సర్వీస్‌ ఎగ్జామ్‌ రాజేందుకు యూపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in లాగిన్‌ చేయాలి. హోమ్ పేజీలో యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2024 లింక్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేలా కొత్త విండో ఓపెన్‌ అవుతుంది. మొదట రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ పూర్తయ్యాక అకౌంట్‌లోకి లాగిన్‌ ఇవ్వాలి. ఆ తర్వాత ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫారమ్‌ను నింపి.. ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత పేజీని డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఏదైనా అవసరం కోసం హార్డ్‌ కాపీని తమ వద్ద ఉంచుకోవాలి. అభ్యర్థులు దరఖాస్తును నింపే సమయంలో కొన్ని పత్రాలను జమ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం వర్కింగ్‌లో ఉన్న ఈ మేయిల్‌ ఐడీ, మొబైల్‌ నంబర్‌, స్కాన్డ్‌ ఫొటో, సతకం, గుర్తింపు కార్డు, విదార్హతలకు సంబంధించి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ కోసం, అభ్యర్థి తప్పనిసరిగా భారత పౌరుడై ఉండాలి. ఇతర సర్వీసెస్‌ కోసం అభ్యర్థి తప్పనిసరిగా భారత పౌరులతో పాటు నేపాల్‌, భూటాన్‌ పౌరులు సైతం దరఖాస్తు చేసుకునేందుకు వీలుంటుంది. భారతదేశంలో శాశ్వతంగా స్థిరపడాలనే ఉద్దేశంతో జనవరి 1, 1962 కంటే ముందు భారతదేశానికి వచ్చిన టిబెటన్ శరణార్థ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పాకిస్తాన్, బర్మా, శ్రీలంక, తూర్పు ఆఫ్రికా దేశాలైన కెన్యా, ఉగాండా, యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ టాంజానియా, జాంబియా, మలావి, జైర్, ఇథియోపియా, వియత్నాం నుంచి వచ్చిన భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు సైతం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ రూపంలో ఇస్తారు. నెగెటివ్ మార్కులు సైతం ఉంటాయి. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్స్‌ రాసేందుకు అర్హత సాధిస్తారు. మెయిన్స్‌ పరీక్ష డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది. ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి రూల్‌ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. తెలంగాణలో హైదరాబాద్‌, వరంగల్‌లో పరీక్ష కేంద్రాలు ఉండగా.. ఏపీలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురంలో జరుగనున్నాయి.

read also : Cinnamon Milk : దాల్చిన చెక్క పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..!