UPSC Civils 2025 : సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షల నోటిఫికేషన్ కోసం ఏటా ఎంతోమంది అభ్యర్థులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఎట్టకేలకు ఆ నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) విడుదల చేసింది. 979 పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడించింది. అర్హులైన అభ్యర్థులు ఈరోజు నుంచి ఫిబ్రవరి 11న సాయంత్రం 6 గంటల వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేయొచ్చు. యూపీఎస్‌సీ సివిల్స్(UPSC Civils 2025) ప్రిలిమినరీ పరీక్ష మే 25న జరగనుంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసులో 150 పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్‌ను యూపీఎస్‌సీ రిలీజ్ చేసింది. దీనికి కూడా ఈరోజు నుంచి ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తులను సమర్పించొచ్చు.
Also Read :AI Cancer Vaccine : ఏఐతో 48 గంటల్లోనే క్యాన్సర్ వ్యాక్సిన్.. ఎలాగో చెప్పేసిన ఒరాకిల్ ఛైర్మన్
అభ్యర్థులూ ఇవి గుర్తుంచుకోండి..
- ఏదైనా డిగ్రీ కోర్సులో పాసైన వారు యూపీఎస్సీ సివిల్స్ పరీక్షకు అప్లై చేయొచ్చు.
- 21 నుంచి 32 ఏళ్లలోపు వారు అప్లై చేయొచ్చు.
- కొన్ని వర్గాల అభ్యర్థులకు రిజర్వేషన్ల ఆధారంగా వయోపరిమితిలో మినహాయింపు లభిస్తుంది.
- ఓబీసీలు, ఇతర అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.100.
- మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఇస్తారు.
Also Read :Chalapati Selfie With Wife : భార్యతో సెల్ఫీ దిగి చలపతి దొరికిపోయాడు.. మావోయిస్టు అగ్రనేత ఎన్‌కౌంటర్‌కు కారణమదే
పరీక్షల వివరాలివీ..
- సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో 2 పేపర్లు ఉంటాయి. వీటికి మొత్తం 400 మార్కులు ఉంటాయి.
- ప్రిలిమ్స్ పరీక్షలో ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు అడుగుతారు. నెగెటివ్ మార్కులు ఉంటాయి.
- ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారే సివిల్స్ మెయిన్స్ పరీక్షకు అర్హత సాధిస్తారు.
- మెయిన్స్ పరీక్షలో వ్యాసరచన ఉంటుంది. అంటే సుదీర్ఘ సమాధానాలు రాయాలి.
- మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే సివిల్స్ ఇంటర్వ్యూకు పిలుస్తారు.
- రిజర్వేషన్ ఆధారంగా సివిల్స్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం, హైదరాబాద్, వరంగల్‌లలో సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రాలు ఉంటాయి.
- తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడలలో సివిల్స్ మెయిన్స్ పరీక్ష కేంద్రాలు ఉంటాయి.