Site icon HashtagU Telugu

UPSC Civil Service Prelims: యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా

Upsc Civil Service Prelims

Upsc Civil Service Prelims

UPSC Civil Service Prelims: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2024 వాయిదా పడింది. లోక్‌సభ ఎన్నికల తేదీ కారణంగా సివిల్ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (2024), ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌-2024 ప్రిలిమినరీ పరీక్షను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) వాయిదా వేసింది. మే 26న నిర్వహించనున్న పరీక్షను జూన్ 16 కు వాయిదా వేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ పరీక్ష తేదీకి కొన్ని రోజుల ముందు ప్రిలిమినరీ పరీక్షకు హాజరు కావడానికి హాల్ టికెట్లు అందుబాటులో ఉంచనున్నారు.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మొత్తం 1206 ఖాళీగా ఉన్న పోస్టులను రిక్రూట్ చేయవలసి ఉంది. వీటిలో 1056 పోస్టులు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్/ఐఏఎస్ కోసం రిజర్వ్ చేయగా, 150 పోస్టులు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) కోసం కేటాయించారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవరి 14న విడుదల చేశారు. ఫిబ్రవరి 14 నుంచి మార్చి 6 వరకు దరఖాస్తులు స్వీకరించారు. మార్చి 6 నుంచి 12 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు.

సివిల్ సర్వీసెస్ పరీక్షకు గరిష్గంగా 6 సార్లు మాత్రమే అవకాశం కల్పిస్తారు. ఓబీసీ, దివ్యాంగులక 9 సార్లు, అలాగే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎన్నిసార్లు అయినా పరీక్ష రాయడానికి అవకాశం కల్పించారు. ఇక పరీక్ష విషయానికి వస్తే..మొత్తం 400 మార్కులకు సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో రెండు పేపర్లుంటాయి.

సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం దేశవ్యాప్తంగా ఏడాదికి 10 లక్షల వరకు అభ్యర్థులు పోటీ పడుతుంటారు. గతేడాది 1105 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలకాగా ఈ ఏడాది 1056 పోస్టుల భర్తీ చేయనున్నారు. ఐఏఎస్,ఐసీఎస్,ఐఎఫ్ఎస్ సహా 23 సర్వీసుల్లో నియాకం కోసం ఏటా యూపీఎస్సీ..సివిల్​ సర్వీసెస్​ పరీక్షలను ఏటా ప్రిలిమినరీ, మెయిన్​, ఇంటర్వ్యూ అని మూడు దశల్లో నిర్వహిస్తుందన్న విషయం తెలిసిందే.

Also Read: Tamilisai: పార్లమెంట్ బరిలో తమిళిసై, ఏ స్థానం నుంచో అంటే!