Site icon HashtagU Telugu

UP : భర్త మర్మాంగాన్ని సిగరెట్ తో కాల్చిన భార్య..అంతే కాదు..!!

Up Woman Tied Husband

Up Woman Tied Husband

నిత్యం వార్తల్లో భర్త చేతిలో దెబ్బలు తిన్న భార్య..కట్నం కోసం భార్యను హింసిస్తున్న భర్త..భార్య ఫై యాసిడ్ దాడి చేసిన భర్త..పరాయి స్త్రీ మోజులో పడి భార్యను కడతేర్చిన భర్త..ఇలా ఎన్ని రకాల వార్తలు ప్రతి రోజు ఎక్కడో చోట కనిపిస్తూ..విన్పిస్తూనే ఉంటాయి. కానీ ఉత్తర ప్రదేశ్ లో మాత్రం రివర్స్ జరిగింది. భర్తకే చుక్కలు చూపించింది భార్య..తనలోని సైకో ని భర్త ఫై చూపించింది. బెదిరించడం..కొట్టడం ..తిట్టడమే కాదు ఏకంగా మత్తుమందు ఇచ్చి భర్త మర్మాంగాన్ని సిగరెట్ తో కాల్చి..కట్ చేయాలనీ చూసింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని బిజ్నూర్‌ లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే..

బిజ్నూర్‌ ప్రాంతానికి చెందిన మన్నన్ జైదీ అనే వ్యక్తి గత ఏడాది నవంబర్లో మెహర్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన కొద్ది రోజులకే ఆమె వేరు కాపురం పెట్టాలంటూ భర్తను బలవంతం చేసింది. దీంతో వేరే కాపురం పెట్టాడు. అలా వేరు కాపురం పెట్టిన కొద్ది రోజులకే తన భార్య అసలు రంగు బయటపడింది.
భార్య మందు తాగడంతో పాటు సిగరెట్లు కాల్చే అలవాటు ఉందని తెలిసి షాక్ అయ్యాడు. అక్కడి తో ఆగలేదు..ప్రతి రోజు భర్త తో గొడవ పడడం..కొట్టడం ..తిట్టడం చేస్తూ వచ్చింది. దీంతో ఆమె పెట్టె టార్చర్ తట్టుకోలేక మన్నన్ పోలీసులను ఆశ్రయించాడు . బాధితుడు చెప్పిన మాటలు విని వారంతా నవ్వడం మొదలుపెట్టారు. తన బాధను పట్టించుకోలేదు. దీంతో ఎలా కాదని చెప్పి రూమ్ లో సీక్రెట్ కెమెరా పెట్టి..భార్య బాగోతం బయటపెట్టాలని అనుకున్నాడు. అలాగే చేసాడు.

We’re now on WhatsApp. Click to Join.

జైదీకి పాలలో మత్తు పదార్థం కలిపి ఇచ్చిన మెహెర్.. అతడు స్పృహ తప్పిన తర్వాత చీరలు, చున్నీలతో అతడి కాళ్లు చేతులు కట్టేసింది. దుస్తులు విప్పేసి అతడి మీద కూర్చొని సిగరెట్ తాగుతూ.. సిగరెట్‌తో అతడి శరీరాన్ని కాల్చడం చేసింది. అక్కడితో ఆగకుండా.. ఓ కత్తితో అతడి మర్మాంగాన్ని కత్తిరించే ప్రయత్నం చేసింది. సున్నితమైన ఆ భాగంలోనూ సిగరెట్‌తో చురకలు పెట్టింది. నన్ను వదిలేయమని అతడు ప్రాధేపయడినా వినకుండా చిత్రహింసలకు గురి చేసింది. తెల్లారిన తర్వాత అతడు ఇంట్లో నుంచి పారిపోయి పోలీసులను ఆశ్రయించాడు. ఈ వీడియో చూశాక.. అతణ్ని హాస్పిటల్‌లో చేర్పించిన చక్ మహదూద్ పోలీసులు.. ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇదంతా తెలిసి కుటుంబ సభ్యులు , స్థానికులు షాక్ అయ్యారు. ఇలాంటి ఆడవారు కూడా ఉంటారా..? అని అంత ఆశ్చర్యం వ్యక్తం చేసారు.

https://twitter.com/bijnorpolice/status/1787033226264915997?

Read Also : AP : రాష్ట్రంలో ఎన్డీఏ గెలుపును ఎవరూ ఆపలేరు – చంద్రబాబు