Motherhood : మహిళలకు లభించే గొప్ప వరం మాతృత్వం. అమ్మ కావడంతో మగువల జీవితానికి సార్థకత చేకూరుతుంది. ఒకప్పుడు పది మంది దాకా పిల్లలను కనేవారు. కానీ మన దేశంలో కుటుంబ నియంత్రణ ఉద్యమం బలంగా జరిగిన తర్వాతి నుంచి ఇద్దరు లేదా ముగ్గురికి మించి పిల్లల్ని కనడం లేదు. అయితే ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లా మోహల్లా బజరంగ్‌పూర్‌కు చెందిన ఇమాముద్దీన్ అనే వ్యక్తి భార్య గుడియా తన 50వ ఏట 14వ బిడ్డకు జన్మనిచ్చారు.
Also Read :Anam Mirza : సానియా మీర్జా సోదరి ‘దావతే రంజాన్’లో కాల్పుల కలకలం
నలుగురు పిల్లలు పుట్టగానే..
ఆమె పురిటినొప్పులతో బాధపడుతుండగా తొలుత పిల్ఖువా సీహెచ్‌సీ ఆస్పత్రిలో జాయిన్ చేశారు. అక్కడి డాక్టర్ల సూచన మేరకు మీరఠ్ ఆస్పత్రికి గుడియాను తరలించారు. అయితే మార్గం మధ్యలో గుడియాకు పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో పరిస్థితి విషమించింది. ఈ పరిస్థితుల్లో అంబులెన్స్ సిబ్బంది వాహనాన్ని పక్కకు ఆపి గుడియాకు డెలివరీ చేశారు. ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చారు. అనంతరం అదే అంబులెన్సులో గుడియాను, ఆమెకు పుట్టిన పసికందును ఆస్పత్రికి తరలించారు. వారిని పరిశీలించిన డాక్టర్లు, ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు వెల్లడించారు. దీనిపై గుడియా స్పందిస్తూ.. ‘‘నాకు ఇది 14వ డెలివరీ. అయితే నా పిల్లల్లో నలుగురు పుట్టగానే చనిపోయారు. ప్రస్తుతం పదిమంది పిల్లలు ఉన్నారు’’ అని వెల్లడించారు. వైద్యులు కూడా ఈవివరాలను ధ్రువీకరించారు.
Also Read :Jagga Reddy Movie: నాపై ఎన్నో కుట్రలు.. నా జీవిత పోరాటాన్ని సినిమాలో చూపిస్తా : జగ్గారెడ్డి
66 ఏళ్ల వయసులో 10వ బిడ్డకు జననం
జర్మనీకి చెందిన 66 ఏళ్ల వృద్ధురాలు అలెగ్జాండ్రా హిల్డెబ్రాండ్(Motherhood) 10వ బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె ఒక చరిత్రకారిణి. బెర్లిన్ నగరంలో చెక్ పాయింట్ చార్లీ వద్ద ఉండే వాల్ మ్యూజియం డైరెక్టరుగా అలెగ్జాండ్రా పనిచేస్తున్నారు. ఆమె మార్చి 19న బెర్లిన్లోని చారిట్ ఆస్పత్రిలో తన మగ శిశువు స్వాగతం పలికారు. అతడికి ఫిలిప్ అని పేరు పెట్టారు. ఈక్రమంలో అలెగ్జాండ్రాకు సిజేరియన్ సర్జరీ చేశారు. ఆమెకు పుట్టిన బిడ్డ బరువు ఏడు పౌండ్ల 13 ఔన్సులు ఉంది.