భారత రక్షణ వ్యవస్థకు సంబంధించిన కీలక సమాచారాన్ని తెలుసుకునేందుకు పాకిస్తాన్ ఎన్నో కుట్రలు చేస్తోంది. తాజాగా ఉత్తర ప్రదేశ్‌లో హనీ ట్రాప్‌కు గురైన ఓ వ్యక్తి మిలిటరీ రహస్యాలను పాకిస్తాన్‌కు చేరవేసిన ఘటన సంచలనంగా మారింది. పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ కోసం పనిచేస్తున్న నేహా శర్మ (ISI Neha SHarma) అనే మహిళతో స్నేహం చేసి, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ(Ordnance factory in Firozabad)లో పనిచేస్తున్న రవీంద్ర కుమార్ (Ravindra ) సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్‌కు అందించాడు. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన నేహా శర్మ, డబ్బుల ఆశ చూపిస్తూ అతని నుంచి కీలక డేటా పొందినట్లు విచారణలో వెల్లడైంది.
SLBC Tunnel Incident: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ఘటన.. సహాయక చర్యల పురోగతిపై సమీక్ష!
రవీంద్ర కుమార్ నేహా శర్మకు వాట్సాప్ ద్వారా భారత సైన్యం, ఆయుధ ఉత్పత్తి, గగన్‌యాన్ ప్రాజెక్ట్ వంటి రహస్య సమాచారం పంపినట్లు పోలీసులు గుర్తించారు. అతడు నేహా శర్మ నంబర్‌ను ‘చంద్రన్ స్టోర్‌కీపర్’ పేరుతో సేవ్ చేసుకున్నాడని, వారి మధ్య జరిగిన సంభాషణల్లో కీలక సమాచార మార్పిడి జరిగినట్లు అధికారులు తెలిపారు. 51 గోర్ఖా రైఫిల్స్ రెజిమెంట్‌లో జరిగిన లాజిస్టిక్స్ డ్రోన్ టెస్టుల వివరాలు, స్క్రీనింగ్ కమిటీ రహస్య లేఖలు, ఉత్పత్తి వివరాలు లాంటి కీలక డేటాను లీక్ చేసినట్లు పోలీసులు ధృవీకరించారు.
Chiranjeevi : తమ్ముడికి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
ఇప్పటికే రవీంద్ర కుమార్‌తో పాటు అతని స్నేహితుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. అతడు కేవలం నేహా శర్మతో మాత్రమే కాకుండా, ఐఎస్ఐతో నేరుగా సంబంధం కలిగి ఉన్నట్లు ఆధారాలు లభించాయి. భారత రక్షణ రంగానికి చెందిన ప్రాజెక్టులపై పాకిస్తాన్‌కు సమాచారం అందించే ప్రయత్నం చేశాడని అనుమానిస్తున్నారు. అతని వాట్సాప్ చాట్స్‌ను పోలీసులు పరిశీలిస్తుండగా, మరిన్ని సంచలన విషయాలు వెలుగు చూడనున్నట్లు సమాచారం.