Site icon HashtagU Telugu

UP Man Shoots Video: దారుణం.. భార్య ఆత్మహత్య చేసుకుంటుండగా వీడియో తీసిన భర్త

Suicide Hanging 19

Suicide Hanging 19

ఉత్తర ప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య ఆత్మహత్య చేసుకుంటున్న సమయంలో భర్త అడ్డుకోకుండా వీడియో రికార్డు చేసి కుటుంబసభ్యులకు అప్పగించిన ఘటన కాన్పూర్‌లో చోటు చేసుకుంది. కాన్పూర్‌కు చెందిన శోబితా గుప్తా, సంజీవ్ గుప్తాలు భార్య భర్తలు. వీరిద్దరి మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో శోబితా గుప్తా ఆత్మహత్యకు పాల్పడింది. దీనిని ఆమె భర్త సంజీవ్ గుప్తా సెల్ ఫోన్ లో వీడియో తీసి సంఘటన జరిగిన తరువాత శోబిత తల్లిదండ్రులకు సమాచారం అందించాడు.

వారు సంఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత కూతురి మృతదేహం మంచంపై పడి ఉండటాన్ని వారు చూశారు. మేము ఇంటికి చేరుకున్నప్పుడు మా కుమార్తె మృతదేహం మంచం మీద పడి ఉంది. సంజీవ్ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లకుండా పంపింగ్ చేస్తున్నాడు. మేము వెంటనే ఆమెను తీసుకొని ఆసుపత్రికి తీసుకెళ్లాము. అక్కడ ఆమె చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. సంజీవ్ తీసిన వీడియో మాకు ఇచ్చాడు. ఆమె ఇంతకు ముందు ఉరి వేసుకోవడానికి ప్రయత్నించిందని సంజీవ్ మాతో చెప్పాడని తండ్రి రాజ్‌కిషోర్ గుప్తా చెప్పారు. ఈ సంఘటనపై విచారించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు పోలీసులు శోబిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వీడియోతో సహా మొత్తం ఘటనపై విచారణ జరుపుతున్నామని ఏసీపీ అనుప్ సింగ్ తెలిపారు. ‘‘భర్తతో విభేదాలు రావడంతో ఆ మహిళ ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. భర్తను ప్రశ్నిస్తున్నాం’’ అని తెలిపారు. మృతుడి బంధువులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని ఏసీపీ సింగ్ తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Exit mobile version