UP Judge Death: మహిళా సివిల్ జడ్జికే రక్షణ లేదు, సామాన్య మహిళ పరిస్థితేంటి

ఉత్తరప్రదేశ్‌లోని ఓ మహిళా సివిల్ జడ్జి మృతి కలకలం రేపింది. తన క్వార్టర్‌లో ఉరివేసుకుని కనిపించడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా స్పందించారు.

UP Judge Death: ఉత్తరప్రదేశ్‌లోని ఓ మహిళా సివిల్ జడ్జి మృతి కలకలం రేపింది. తన క్వార్టర్‌లో ఉరివేసుకుని కనిపించడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా స్పందించారు.బీజేపీ పాలనలో మహిళా న్యాయమూర్తుల భద్రత పరిస్థితి ఇలా ఉంటే.. ఓ సాధారణ బాలిక రోజూ ఎలాంటి భయంతో జీవిస్తుందో ఊహించుకోండి అని ప్రియాంక గాంధీ అన్నారు. కాగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం మహిళలపై జరిగే నేరాల్లో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. అక్కడ ప్రతి గంటకు ఎనిమిది మంది మహిళలు నేరాలకు గురవుతున్నారు. ఉత్తరప్రదేశ్ మహిళలకు పూర్తిగా అసురక్షితంగా మారింది, ఎందుకంటే భద్రతకు సంబంధించిన వాగ్దానాలు అన్ని ప్రకటనలలో మాత్రమే కనిపిస్తాయని మండిపడ్డారు ఆమె.

సమాజంపై అవగాహన ద్వారా మాత్రమే మహిళలని అణచివేత సుడిగుండం నుండి బయటకు తీసుకువస్తుందని ఆమె అన్నారు. సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) జ్యోత్స్నా రాయ్ (27) మృతదేహాన్ని వెలికితీశారు. దీంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఆమె సూసైడ్ నోట్‌ ను గుర్తించారు. అయితే శనివారం సాయంత్రం బుదౌన్‌కు చేరుకున్న ఆమె తండ్రి తన కుమార్తెను చంపేశారని, హంతకులు ఆమె మృతదేహాన్ని ఆమె బెడ్‌రూమ్‌లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యగా చిత్రీకరించారని వాపోయారు. తండ్రి అశోక్ కుమార్ రాయ్ మాట్లాడుతూ తన కూతురు చాలా ధైర్యవంతురాలై అందరికీ న్యాయం జరిగేలా చూసింది. ఆమె ఎప్పటికీ ఆత్మహత్య చేసుకోదని ఆయన తెలిపారు.

యూపీలోని బుదౌన్ జిల్లాలో జడ్జి మృతిపై ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని వ్యక్తులపై హత్య కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. త్వరలోనే అసలు దోషులను పట్టుకుంటామని చెప్పారు.

Also Read: Uttarakhand – UCC : యూసీసీ డ్రాఫ్ట్‌కు ఉత్తరాఖండ్ మంత్రివర్గం పచ్చజెండా.. 6న అసెంబ్లీకి బిల్లు!