గుడ్లు రవాణా విషయంలో ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) పశుసంవర్ధక శాఖ వ్యాపారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. చల్లని వాతావరణంలో వాహనాల్లోనే గుడ్లు రవాణా (eggs Transport) చేయాలని కొత్త నిబంధన విధించింది. ప్రభుత్వం తాజా నిబంధనపై గుడ్ల వ్యాపారులు మండిపడుతున్నారు. ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొత్త నిబంధన విరమించుకోకపోతే గుడ్ల రవాణా నిలిచిపోయి సరఫరా తగ్గిపోతుందని, ఫలితంగా ధరలు పెరగడం ఖాయమని వ్యాపారులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు యూపీలోని 25 జిల్లాలకు చెందిన గుడ్ల వ్యాపారులు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనపై వ్యాపారులు ఏకగ్రీవంగా అభ్యంతరం తెలిపారు.
యూపీ ఆదర్శ వ్యాపార్ మండల్ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ గుప్తా, యూపీ గుడ్ల వ్యాపారుల సంఘం అధ్యక్షుడు మహ్మద్ యమీన్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. యమీన్ మాట్లాడుతూ.. కేవలం యూపీలో మాత్రమే ఈ నిబంధన అమలు చేయడం వల్ల ఇతర రాష్ట్రాలతో వ్యాపారం చేయడంలో చాలా అసౌకర్యానికి గురవుతున్నామని తెలిపారు. ఈ నిబంధన అమలైతే గుడ్ల ధరలు ప్రస్తుతం ధరకంటే మూడు రెట్లు పెరిగే అవకాశం ఉందని, ఫలితంగా పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడతారని అన్నారు.
ప్రభుత్వం నూతన నిబంధనలు వెనక్కుతీసుకోకపోతే తాము గుడ్ల రవాణాను నిలిపివేస్తామని, తద్వారా రాష్ట్రంలో గుడ్ల కొరత ఏర్పడుతుందని వ్యాపారులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
WhatsApp New Feature: వాట్సాప్ వినియోగదారులకు మరో శుభవార్త.. ఇకపై ఒకే యాప్ లో రెండు అకౌంట్స్?