Site icon HashtagU Telugu

UP Elections 2022 : యూపీలో ‘మాయా’ మ‌ర్మం

Mayawathi

Mayawathi

యూపీ ఎన్నిక‌ల బ‌రి నుంచి బీఎస్పీ అధినేత్రి మాయావ‌తి త‌ప్పుకుంది. ఆ విష‌యాన్ని బీఎస్పీ ఎంపీ స‌తీశ్ చంద్ర విశ్రా వెల్ల‌డించాడు. ఫ‌లితంగా బీజేపీ, ఎస్పీ మ‌ధ్య హోరాహోరీ పోరు జ‌ర‌గ‌నుంది. సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావిస్తున్న ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వ్య‌వ‌హారం రోజుకో మ‌లుపు తిరుగుతోంది. రాజకీయ క్షేత్రంలో అఖిలేష్, యోగి ఆదిత్యానాథ్ మ‌ధ్య నువ్వా? నేనా? అనే పోరుకు మార్గం సుగ‌మ‌మం అయింది. బీఎస్పీ చీఫ్ మౌనం దాల్చ‌డం ఎస్పీకి బ‌లం చేకూరింది.ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే అధికార బీజేపీతో పాటు విపక్ష సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్, ఇతర పక్షాలు కూడా ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్న నేపథ్యంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి మాత్రం మౌనంగా ఉండిపోతున్నారు. దీంతో ఆమెకు ఉన్న దళిత ఓటు బ్యాంకు ఎటువైపు మళ్లుతుందనే దానిపైనా ఊహాగానాలు మొన్న‌టి వ‌ర‌కు ఉండేవి. ఇలాంటి సమయంలో మాయావతి అసలు అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీ చేయడం లేదని పార్టీ తరఫున ఎంపీ సతీశ్ చంద్ర మిశ్రా ప్రకటించడం సంచలనం రేపుతోంది.

మాయావతితో పాటు తాను కూడా ఈ అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు బీఎస్పీ ఎంపీ సతీశ్ చంద్ర మిశ్రా ఇవాళ వెల్లడించారు. అదే సమయంలో ఎస్పీ, బీజేపీలపై ఆయన సైటెర్లు వేశారు. ఎస్పీకి పోటీ చేయడానికి 400 మంది అభ్యర్ఝులే లేనప్పుడు వారు 400 సీట్లు ఎలా గెలుస్తారని మిశ్రా ప్రశ్నించారు. అంతే కాదు వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చే సత్తా ఎస్పీ, బీజేపీ ఇద్దరికీ లేదన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది బీఎస్పీ మాత్రమేనని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో బీఎస్పీ రాజకీయమేంటో …దాని వెనుక ఉన్న మ‌ర్మం ఏమిటో అర్ధం కావడం లేదు.