Site icon HashtagU Telugu

UP Action: ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై పోలీసులు లాఠీలు, కర్రలతో దాడి చేశారు

Up Police Imresizer

Up Police Imresizer

ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. మహిళలపై అసభ్య పదజాలంతో దుర్భాషలాడడమే కాకుండా కర్రలు, లాఠీలు, పైపులతో పోలీసులు విచక్షణారహితంగా దాడి చేశారు. యూపీ పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.

 

వివరాల ప్రకారం… అంబేద్కర్ నగర్ జిల్లా జలాల్ పూర్ ప్రాంతంలో ఇటీవలే అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆ ప్రాంతం తమదేనంటూ కొందరు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీంతో అప్పటి నుంచి ఆ ప్రాంతంపై వివాదం నడుస్తోంది. విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ స్థానికులు ఆదివారం ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళన ప్రాంతానికి చేరుకున్నారు. ఆందోళనకారులపై లాఠీలు, పైపులు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. కొందరు మహిళలు పోలీసుల వాహనాలపై రాళ్లు రువ్వారని, వారిని చెదరగొట్టేందుకు లాఠీచార్జి చేయాల్సి వచ్చిందని అంబేద్కర్ నగర్ సీనియర్ పోలీసు అధికారి అజిత్ కుమార్ తెలిపారు. పోలీసు వాహనాన్ని ధ్వంసం చేసినట్లు వారు తెలిపారు.