CM Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భారతదేశం విభజన సమయంలో జరిగిన పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విభజన రోజున లక్నోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం యోగి మాట్లాడుతూ రాజకీయ స్వార్థం కోసం దేశాన్ని విభజన విషాదం వైపు నెట్టారని అన్నారు. కాంగ్రెస్ అధికార దురాశ వల్ల భారత్‌కు ఇలాంటి దుస్థితి ఏర్పడింది, అది ఇప్పటికీ ఉగ్రవాద రూపంలో మనల్ని కుదిపేస్తోందని మండిపడ్డారు.
1947లో ఏం జరిగిందో అదే నేడు బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లో జరుగుతోందన్నారు సీఎం యోగి. అక్కాచెల్లెళ్లు, కూతుళ్లను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. అయితే రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా భారతదేశంలో కొందరు దీనిపై మౌనం వహిస్తున్నారు అంటూ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ని విమర్శించారు. .1947లో 10 లక్షల మంది హిందువులు, సిక్కులు హత్యకు గురయ్యారు. అయితే నేడు కూడా మహిళలపై దోపిడీలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని అన్నారు. నేటికీ అదే తరహా విషాదం కనిపిస్తోంది. ఈ రోజు ఒకటిన్నర కోట్ల మంది హిందువులు బంగ్లాదేశ్ లో సాయం కోసం ఎదురు చూస్తున్నారని విచారం వ్యక్తం చేశారు.
విపక్షాలను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ నేడు భారతదేశంలో లౌకికవాదుల నోళ్లు మూతపడ్డాయి. ఎందుకంటే బలహీనవర్గాలకు అనుకూలంగా స్వరం ఎత్తేస్తే తమ ఓటు బ్యాంకు గల్లంతవుతుందన్న భయం వారిలో ఉంది. వారు ఓటు బ్యాంకు గురించి ఆందోళన చెందుతున్నారు కానీ మానవత్వం లేదని రాహుల్ గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు సీఎం యోగి. దేశ విభజన మాత్రమే కాదు, మానవాళి విభజన, ఈ అమానవీయ నిర్ణయం కారణంగా లెక్కలేనన్ని అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు, ఉన్న ప్రదేశాలని వదిలి వలస వెళ్లారు. హింసను భరించారు. ఈ అమానవీయ దుర్ఘటనలో ప్రాణత్యాగం చేసిన అమాయక పౌరులందరికీ నేడు ‘విభజన భయానక స్మారక దినం’ సందర్భంగా నివాళులర్పిస్తున్నాను అంటూ ముగించారు.
Also Read: Breakfast: బ్రేక్ ఫాస్ట్ ని స్కిప్ చేస్తున్నారా.. బరువు పెరగడంతో పాటు ఎన్నో సమస్యలు?