‘Jumlajeevi’ to ‘Tanashahi’: చ‌ట్ట‌స‌భ‌ల్లో వాడ‌కూడ‌ని తాజా ప‌దాలు

చ‌ట్ట స‌భ‌ల్లో ఇష్టానుసారం మాట్లాడ‌కుండా కొన్ని నిబంధ‌న‌ల‌ను పార్ల‌మెంట్ తాజాగా తయారు చేసింది. వాటిని ప్ర‌త్యేక బులిటెన్ రూపంలో విడుద‌ల చేస్తూ కొన్ని ప‌దాల‌ను నిషేధించింది.

  • Written By:
  • Updated On - July 14, 2022 / 01:04 PM IST

చ‌ట్ట స‌భ‌ల్లో ఇష్టానుసారంగా మాట్లాడ‌కుండా కొన్ని నిబంధ‌న‌ల‌ను పార్ల‌మెంట్ తాజాగా తయారు చేసింది. వాటిని ప్ర‌త్యేక బులిటెన్ రూపంలో విడుద‌ల చేస్తూ కొన్ని ప‌దాల‌ను నిషేధించింది. ఇష్టానుసారంగా చ‌ట్ట‌స‌భ‌ల్లో మాట్లాడ‌డానికి లేకుండా ఇండియ‌న్ పార్ల‌మెంట్ కొన్ని కండీష‌న్ల‌ను పెట్టింది. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌లు ర‌కాల ప‌దాల‌ను వాడుతూ ప్ర‌త్య‌ర్థుల‌ను దూషించే సీన్ల‌ను చూశాం. అలాంటి వాటికి అవ‌కాశం లేకుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. తాజా నిబంధ‌న‌ల‌ను ఈనెల 18వ తేదీ నుంచి జ‌రిగే వ‌ర్షాకాల పార్ల‌మెంట్ స‌మావేశాల నుంచి అమ‌లు చేయ‌డానికి భార‌త ప్ర‌భుత్వం సిద్ధం అయింది.

లోక్ సభ, రాజ్యసభలో ఎంపీలు కొన్ని పదాలను వాడకూడదని లోక్ సభ సెక్రటేరియట్ ఒక బుక్లెట్ ను విడుదల చేసింది. అవినీతిపరుడు, అసమర్థుడు, నాటకం, నటన, సిగ్గులేదు, ధోకేబాజ్‌ వంటి పదాలను అన్ పార్టమెంటరీ పదాలుగా గుర్తించింది. వాటిని ఉభయ సభల్లో సభ్యులు వాడటానికి వీలులేదు. అలాంటి ప‌దాలు అభ్యంత‌ర‌క‌ర‌మ‌ని తేల్చింది.

బ్లడ్‌షెడ్, బ్లడీ, బీట్రేడ్, అషేమ్డ్, అబ్యూస్డ్, చీటెడ్, కరప్ట్, కవర్డ్, క్రిమినల్, క్రొకొడైల్‌ టియర్స్, డాంకీ, డ్రామా, ఐవాష్, హూలిగనిజం, హిపోక్రసీ, మిస్‌లీడ్, లై, అన్‌ట్రూ, కోవిడ్‌ స్ప్రెడర్, స్నూప్‌గేట్‌ వంటి ఇంగ్లిష్ పదాలను ఆ జాబితాలో చేర్చింది. వీటితో పాటు చంచా, చంచాగిరి, అసత్య, అహంకార్, గూన్స్, అప్‌మాన్, కాలా బజారీ, దలాల్, దాదాగిరీ, బేచారా, బాబ్‌కట్, లాలీపాప్, విశ్వాస్‌ఘాత్, బేహ్రీ సర్కారు, జుమ్లాజీవీ, శకుని, వంటి హిందీ పదాలు కూడా వాడ‌కూడ‌ద‌ని బులిటెన్ లో ఉంది.

వివిధ సందర్భాల్లో దేశంలోని చట్ట సభలు, కామన్వెల్త్ దేశాల పార్లమెంట్లలో స్పీకర్లు అభ్యంతరం వ్యక్తం చేసిన పదాలను బుక్ లెట్లో చేర్చారు. అయితే, ఇలాంటి పదాలను వాడిన సభ్యుడిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే దానిపై లోక్ సభ, రాజ్య సభ అధిపతులకు విశేషాధికార‌ల‌ను ఇస్తూ లోక్ సభ సెక్రటేరియట్ వెల్ల‌డించింది.