Site icon HashtagU Telugu

Smriti Irani: ఎన్నికల పాట్లు.. అర్ద రాత్రి స్కూటీపై కేంద్ర మంత్రి

Smriti Irani

Smriti Irani

Smriti Irani: అమేథీ బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అమేథీ నియోజకవర్గంలో ఆమె రాత్రి స్కూటర్‌ నడుపుతూ ప్రజల మధ్యకు వెళ్లారు. అభ్యర్థి స్మృతి ఇరానీ స్కూటర్‌పై ప్రజల మధ్య తిరుగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేంద్ర మంత్రితో పాటు కొందరు పార్టీ కార్యకర్తలు ఉన్నారు. అంతకుముందు ఆమె రాంలాలా దర్శనం తర్వాత శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మరియు మణిరామ్‌దాస్ కంటోన్మెంట్‌కు చెందిన మహంత్ నృత్య గోపాలదాస్‌ను కలుసుకుని ఆశీర్వాదం తీసుకున్నారు.

స్మృతి ఇరానీ మాట్లాడుతూ..రాంలాలాలో నేను పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా జీవితంలో కూడబెట్టిన పుణ్యాల ఫలితమే ఈరోజు నాకు సాధువుల అనుగ్రహం లభించింది. సాధువుల ఆశీస్సులు ఎల్లప్పుడూ మనల్ని కర్తవ్య మార్గంలో ముందుకు సాగేలా ప్రేరేపిస్తాయన్నారు ఆమె. దేశ ప్రగతి, శ్రేయస్సుతోపాటు ప్రధాని మోదీ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నట్లు స్మృతి ఇరానీ తెలిపారు. రాంలాలా కరుణ ప్రతి హృదయాన్ని తాకుతోంది. రామభక్తుల గొప్ప అదృష్టం ఏమిటంటే రామాలయంలో భగవంతుడిని మనం చూడగలుగుతున్నామని తెలిపారు. కాగా స్మృతి ఇరానీ రాకతో స్థానికంగా ప్రజలు అవాక్కయ్యారు. కేంద్ర మంత్రి స్కూటీపై రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

We’re now on WhatsAppClick to Join

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోమవారం అంటే ఈ రోజు ఏప్రిల్ 29న అమేథీ నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు. అయితే గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ తన అభ్యర్థి పేరును ఇంకా ప్రకటించలేదు. ఈ రోజు ఈ నియోజకవర్గానికి కాంగ్రెస్ తమ అభ్యర్థిని ప్రకటించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Also Read: Edida Bhaskara Rao : పవన్ కల్యాణ్‌, వంగా గీతతో ఏడిద భాస్కర్‌రావు ఢీ.. ఎవరాయన ?