Nitin Gadkari Biopic : 27న ‘గడ్కరీ’ బయోపిక్ రిలీజ్.. స్టోరీలో ఏముంది ?

Nitin Gadkari Biopic : నితిన్ గడ్కరీ... సామాన్య నాయకుడు కాదు. ఒకప్పుడు బీజేపీలో ప్రధానమంత్రి పోస్టుకు పోటీ పడిన దిగ్గజ నేత.

Published By: HashtagU Telugu Desk
Nitin Gadkari Biopic

Nitin Gadkari Biopic

Nitin Gadkari Biopic : నితిన్ గడ్కరీ… సామాన్య నాయకుడు కాదు. ఒకప్పుడు బీజేపీలో ప్రధానమంత్రి పోస్టుకు పోటీ పడిన దిగ్గజ నేత. తనకు ఏ శాఖను ఇచ్చినా సక్సెస్ ఫుల్ గా పనిచేయడం ఆయన శైలి. వివాదాలకు దూరంగా ఉంటూ ప్రతిపక్షాలతోనూ స్నేహ సంబంధాలను కలిగి ఉండటం ఆయన స్పెషాలిటీ. తనకు ఆసక్తి కలిగిన అంశాలపై లోతుగా రీసెర్చ్ చేయడం ఆయనకే ప్రత్యేకమైన మార్క్.  ప్రస్తుతం గడ్కరీ కేంద్ర రోడ్డు రవాణా, హైవే శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయనపై ఈనెల 27న ‘గడ్కరీ’ అనే టైటిల్ తో బయోపిక్ రిలీజ్ కాబోతోంది. ఈ మూవీకి ‘హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా’ అనే ట్యాగ్ లైన్ ఉంది.

షూటింగ్ ఇప్పటికే పూర్తయింది

అక్షయ్ అనంత్ దేశముఖ్ నిర్మాణంలో అనురాగ్ రాజన్ బుసారి దర్శకత్వంలో ‘గడ్కరీ’ బయోపిక్ ను నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. అయితే ఇది కేవలం మరాఠీ సినిమాగా తెరకెక్కుతోంది. పాన్ ఇండియా భాషల్లో దీన్ని రిలీజ్ చేస్తారో లేదో చూడాలి. ఈ సినిమాలో నితిన్ గడ్కరీ రోల్ ను ఎవరు చేస్తున్నారో తెలియరాలేదు.  మొత్తానికి ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ మూవీ విడుదలకు మరో 20 రోజులే టైం ఉన్నా హీరో ఎవరో చెప్పకపోవడం గమనార్హం.

We’re now on WhatsApp. Click to Join

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయికి సన్నిహితుడిగా గడ్కరీకి పేరుంది. వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు దేశంలో రవాణా సౌకర్యం లేని గ్రామాలకు రోడ్లు వేయాలని ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అనే కార్యక్రమాన్ని గడ్కరీయే ప్రపోజ్ చేశారు. మహారాష్ట్ర గవర్నమెంట్ లోనూ రోడ్డు రవాణా శాఖ మంత్రిగా పనిచేసి మహారాష్ట్ర రవాణా రోడ్డు శాఖలో అనేక మార్పులను ఆయన తీసుకొచ్చారు. గత తొమ్మిదేళ్లలో గడ్కరీ దేశ రవాణాశాఖలో విప్లవాత్మక మార్పులు (Nitin Gadkari Biopic) తీసుకొచ్చారు.

Also read : Shahrukh Khan: షారుక్ బర్త్ డే సర్ ప్రైజ్, ఓటీటీలోకి వచ్చేస్తున్న జవాన్ మూవీ!

  Last Updated: 07 Oct 2023, 01:45 PM IST