India’s Second Longest Cable Bridge : అందుబాటులోకి వచ్చిన దేశంలోనే రెండో అతిపెద్ద కేబుల్ బ్రిడ్జి

India's Second Longest Cable Bridge : శివమొగ్గ జిల్లా సిగందూర్ సమీపంలోని శరావతి నది(Sharavathi in Shivamogga )పై నిర్మించిన ఈ కేబుల్ బ్రిడ్జి(India's Second Longest Cable )ని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధికారికంగా ప్రారంభించారు

Published By: HashtagU Telugu Desk
India's Second Longest Cabl

India's Second Longest Cabl

దేశంలోని కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణాలలో మరో కీలక మైలురాయిగా నిలిచే వంతెన కర్ణాటకలో నిర్మాణం పూర్తిచేసుకొని ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. శివమొగ్గ జిల్లా సిగందూర్ సమీపంలోని శరావతి నది(Sharavathi in Shivamogga )పై నిర్మించిన ఈ కేబుల్ బ్రిడ్జి(India’s Second Longest Cable )ని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఇది దేశంలోనే రెండో అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిగా గుర్తింపు పొందింది.

ఈ వంతెన నిర్మాణానికి సుమారు రూ.473 కోట్ల వ్యయం జరిగింది. బ్రిడ్జి మొత్తం పొడవు 2.14 కిలోమీటర్లు కాగా, వెడల్పు 16 మీటర్లుగా ఉంది. ఇందులో 740 మీటర్ల వరకూ కేబుల్ ఆధారిత నిర్మాణంగా వుంటుంది. ఈ బ్రిడ్జి ద్వారా శరావతి బ్యాక్ వాటర్‌ను దాటి వెళ్లే వాహనదారులకు, స్థానికులకు పెద్దగా ప్రయోజనం చేకూరనుంది. ఈ వంతెన భౌగోళికంగా కూడికలేని ప్రాంతాలను కలుపుతూ, పరిసర గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యాలను అందిస్తుంది.

Medak : కాంగ్రెస్ యువ నాయకుని దారుణ హత్య

ఇప్పటి వరకు దేశంలో గుజరాత్‌లోని ఒఖా-బేట్ ద్వారక మధ్య నిర్మించిన సుదర్శన్ సేతు కేబుల్ బ్రిడ్జి (పొడవు: 2.32 కి.మీ)నే అత్యంత పొడవైనదిగా ఉంది. శరావతిపై నిర్మితమైన ఈ వంతెన ప్రస్తుతం రెండో స్థానాన్ని దక్కించుకుంది. రవాణా మౌలిక సదుపాయాల విస్తరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ప్రాధాన్యతను కలిగినదిగా భావిస్తున్నారు. బ్రిడ్జి ప్రారంభంతో రాష్ట్రానికి కొత్త అభివృద్ధి మార్గాలు తెరుచుకున్నట్టు నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు.

ఈ బ్రిడ్జి నిర్మాణం ద్వారా కేవలం ప్రయాణ సౌకర్యాలే కాకుండా పర్యాటక అభివృద్ధికీ దోహదం చేయనుంది. శరావతి బ్యాక్ వాటర్ ప్రాంతానికి వచ్చే పర్యాటకులు ఇకపై సురక్షితంగా ఈ వంతెన ద్వారా ప్రయాణించగలుగుతారు. ప్రాంతీయ ఆర్ధిక కార్యకలాపాలు, వ్యాపార అభివృద్ధికి ఇది బలమైన మద్దతు అందిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రాజెక్టుల ద్వారా దేశ మౌలిక నిర్మాణాల్లో పురోగతి కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

  Last Updated: 15 Jul 2025, 11:20 AM IST