Site icon HashtagU Telugu

Fake Currency : ఆ నోట్లతో అప్రమత్తంగా ఉండాలి కేంద్ర హోంశాఖ హెచ్చరికలు

Union Home Ministry warns that one should be vigilant with those notes.

Union Home Ministry warns that one should be vigilant with those notes.

Fake Currency : అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి తయారు చేసిన రూ.500 విలువ గల నకిలీ నోట్లు మార్కెట్లోకి ప్రవేశించినట్లు కేంద్ర హోంశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు వీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ఈ సమాచారాన్ని డీఆర్‌ఐ, ఎఫ్‌ఐయూ, సీబీఐ, ఎన్‌ఐఏ, సెబీతో కూడా పంచుకొంది. ఆ దొంగనోట్ల ప్రింటింగ్‌, నాణ్యత చాలావరకు అసలు నోట్లులాగే ఉన్నట్లు వెల్లడించింది. వాటిని గుర్తించడం కూడా చాలా క్లిష్టంగా మారిందని వెల్లడించింది. అయితే ఈ నకిలీ నోట్లలో ఒక చిన్న స్పెల్లింగ్ పొరపాటు ఉందని అధికారులు గుర్తించారు.

Read Also: Gold ALL TIME RECORD : వామ్మో.. సామాన్యులు బంగారం కొనలేని స్థితికి ధర పెరిగింది

ఇలాంటి నకిలీ నోట్లు ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన ముప్పుగా మారుతాయని అధికారులు స్పష్టం చేశారు. అందుకే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, సంబంధిత ఏజెన్సీలను అప్రమత్తంగా ఉండేలా సూచనలు ఇచ్చారు. ఇప్పటికే ఈ నకిలీ నోట్లు పెద్ద సంఖ్యలో మార్కెట్లోకి చేరిపోయినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. వాటి ఖచ్చిత సంఖ్యను గుర్తించడం చాలా కష్టమైన పని అని ఉగ్రవాదానికి సంబంధించిన ఆర్థిక కార్యకలాపాలపై దర్యాప్తు నిర్వహిస్తున్న ఓ అధికారి తెలిపారు. ప్రజలు,వ్యాపార సంస్థలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచనలున్నాయి.

అదే ఈ నోట్లను అసలైన వాటిలోంచి వేరు చేయడంలో కీలకమవుతుందని చెప్పారు. ”RESERVE BANK OF INDIA” అని ఉండాల్సిన చోట, ”RESERVE” అనే పదంలో చివరి ‘E’ అక్షరం స్థానంలో ‘A’ ఉండే విధంగా ముద్రించారని వెల్లడించారు. కాగా, ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఇవి మార్కెట్లో ఉన్నాయని హెచ్చరించారు. మార్కెట్లో మొత్తం ఎన్ని ఉన్నాయో గుర్తించడం కష్టమని ఉగ్ర ఫైనాన్స్‌పై దర్యాప్తు చేస్తున్న ఓ అధికారి చెప్పారు. ప్రజలు, వ్యాపార సంస్థలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

Read Also: KTR : కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట