War Plan : యుద్ధ సన్నద్ధతపై కేంద్రం సమీక్ష.. పాక్ ఎక్కడ దాడులు చేయొచ్చు ?

భారత్ దాడికి , పాకిస్తాన్ సైన్యం(War Plan) కూడా ప్రతిస్పందించే అవకాశం ఉంది. పాకిస్తాన్ వైపు నుంచి ప్రతిదాడులు జరిగే ముప్పు ఉంది. 

Published By: HashtagU Telugu Desk
500 Drones

500 Drones

War Plan : పాకిస్తాన్‌తో యుద్ధానికి భారత్ రెడీ అవుతోంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే వచ్చే ఆదివారం నాటికి పాక్ ఆక్రమిత కశ్మీరు (పీఓకే)పై భారత్ దాడి చేస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి. భారత్ దాడికి , పాకిస్తాన్ సైన్యం(War Plan) కూడా ప్రతిస్పందించే అవకాశం ఉంది. పాకిస్తాన్ వైపు నుంచి ప్రతిదాడులు జరిగే ముప్పు ఉంది.  అందువల్లే మన దేశంలోని అన్ని రాష్ట్రాల్లో యుద్ధ సన్నద్ధతకు కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. దీనిపై ఈరోజు కేంద్ర హోంశాఖ కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహించనుంది.  బుధవారం రోజు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో సివిల్‌ మాక్‌డ్రిల్స్‌ నిర్వహించాలని కేంద్ర సర్కారు సోమవారం రోజు ఆదేశాలు జారీ చేసింది.  బుధవారం రోజు మాక్‌ డ్రిల్స్‌ జరగనున్న తరుణంలో పలు రాష్ట్రాల ఉన్నతాధికారులతో హోంశాఖ సమీక్ష చేపట్టనుంది. హోంశాఖ కార్యదర్శి గోవింద్‌మోహన్‌ నేతృత్వంలో ఈ సమీక్షా కార్యక్రమం జరుగుతుంది.దేశంలోని దాదాపు  244 జిల్లాల్లో మాక్‌డ్రిల్స్‌కు సంబంధించిన ఏర్పాట్లపై గోవింద్‌మోహన్‌ సమీక్షించనున్నారు.

Also Read :Civil Mock Drill : ఎల్లుండి సివిల్ మాక్ డ్రిల్..కేంద్రం కీలక ఆదేశాలు

కేంద్ర సర్కారు కీలక సూచనలివీ.. 

  • దేశంలోని రాష్ట్రాలన్నీ హాట్‌లైన్, వాయుసేనతో రేడియో కమ్యూనికేషన్లు పనిచేసేలా చూసుకోవాలి.
  • కంట్రోల్‌ రూంల పనితీరును సమీక్షించుకోవాలి.
  • అధికారులతో పాటు సివిల్‌ డిఫెన్స్‌ వార్డెన్లు, వాలంటీర్లు, హోంగార్డులు, ఎన్‌సీసీ/ ఎన్‌ఎస్‌ఎస్, నెహ్రూ యువకేంద్రాలు, కళాశాలలు/ పాఠశాలల విద్యార్థులను మాక్ డ్రిల్‌లలో భాగస్వాముల్ని చేయాలి.
  • శత్రుదాడి జరిగినప్పుడు స్వీయరక్షణతో పాటు విద్యార్థులు, యువకులు ఎలా ప్రతిస్పందించాలో అవగాహన కల్పించాలి.
  • వైమానిక దాడులు జరిగితే.. ఎలా వ్యవహరించాలి? సైరన్‌ ఇచ్చి ఎలా అప్రమత్తం చేయాలనే అంశంపై మాక్‌డ్రిల్‌ చేయనున్నారు.
  • కర్మాగారాలు, ఇతర వ్యవస్థల్ని బయటకు కనిపించకుండా ఏర్పాట్లు చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది.
  • బంకర్లు, కందకాలను శుభ్రపరచుకోవాలని నిర్దేశించింది.

Also Read :Prakash Raj : అమ్మానాన్న గురించి ప్రకాశ్‌రాజ్ ఎమోషనల్ విషయాలు

పాకిస్తాన్ ఎక్కడ దాడులు చేయొచ్చు ? 

  • ఒకవేళ భారత్ – పాక్ మధ్య పెద్ద యుద్ధం, దీర్ఘకాలిక యుద్ధం జరిగితే పాకిస్తాన్‌కు చైనా నుంచి ఆయుధాలు సప్లై అవుతాయి. ఇప్పటికే పాకిస్తాన్‌కు చైనా మద్దతు ప్రకటించిది.
  •  చైనా నుంచి అందే ఆయుధాలతో భారత్‌పై పాకిస్తాన్ దాడులకు దిగుతుంది.
  • భారత్‌లోని ముంబై, కోల్‌కతా, కచ్, తిరువనంతపురం ఓడరేవులను పాకిస్తాన్ ప్రధాన లక్ష్యంగా ఎంచుకునే అవకాశం ఉంది.
  • అరేబియా సముద్ర తీరంలో ఉన్న మహారాష్ట్ర, గుజరాత్‌లను పాకిస్తాన్ నౌకాదళం లక్ష్యంగా చేసుకునే ముప్పు ఉంది.
  • భారత్‌లోని పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్‌, రాజస్థాన్‌లపై పాకిస్తాన్ వాయుసేన దాడులు జరిపే గండం ఉంటుంది.
  • భారత్‌కు చెందిన సియాచిన్ గ్లేసియర్‌పైకి ఉగ్రవాదులను పంపి ఆక్రమణకు పాల్పడేందుకు పాకిస్తాన్ యత్నించొచ్చు.
  • భారత త్రివిధ దళాలకు చెందిన సైనిక స్థావరాలను, ఆయుధ నిల్వ కేంద్రాలను పాకిస్తాన్ ప్రాథమిక టార్గెట్‌గా చేసుకునే అవకాశం ఉంది.
  • మొత్తం మీద పాకిస్తాన్‌తో యుద్ధం వల్ల ఉత్తర, పశ్చిమ భారతదేశ ప్రాంతాల్లోని సరిహద్దు రాష్ట్రాలు ఎక్కువగా ప్రభావితమయ్యే ఛాన్స్ ఉంటుంది.
  • పాకిస్తాన్‌ నుంచి తూర్పు, దక్షిణాది రాష్ట్రాలకు దూరం ఎక్కువ. ఒకవేళ ఈ రాష్ట్రాల వైపు పాకిస్తాన్ మిస్సైళ్లు సంధించినా.. వాటిని మధ్యలో అడ్డుకొని గాల్లోనే కూల్చేసేలా భారత్ వద్ద నాలుగు అంచెల క్షిపణి  రక్షణ వ్యవస్థ ఉంది.
  Last Updated: 06 May 2025, 09:17 AM IST