Amit Shah : కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఉదయం హుటాహుటిన శ్రీనగర్ కు వెళ్లారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఇక కాల్పులు జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన అమిత్ షా.. మృతుల కుటుంబాలతో మాట్లాడి కన్నీరుమున్నీరవుతోన్న వారిని ఓదార్చారు. అనంతరం ఉన్నత స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి ఉగ్రదాడికి సంబంధించి పలు కీలక విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘతుకానికి పాల్పడిన వారు తీవ్ర పరిణామాలను చవిచూస్తున్నారని, ఎవరినీ విడిచిపెట్టే ప్రసక్తి లేదని అమిత్‌షా చెప్పారు. నేరస్థులను కఠినంగా శిక్షిస్తామన్నారు.
Read Also: 600 Marks: ఏపీ పదో తరగతి ఫలితాల్లో సంచలనం.. 600కు 600 మార్కులు!
ఇకపోతే.. ఈ ఉగ్రదాడిపై జమ్మూకశ్మీర్‌లోని పత్రికలన్నీ వినూత్న నిరసన తెలిపాయి. ప్రముఖ పత్రికలు సమష్టిగా స్పందించాయి. గ్రేట్ కశ్మీర్, రైజింగ్ కశ్మీర్, కశ్మీర్ ఉజ్మా, అఫ్తాబ్, తైమీల్ ఇర్షద్ సంప్రదాయ డిజైన్‌ను ప్రచురించలేదు. అందుకు బదులుగా నలుపు రంగును ఎంచుకున్నాయి. ఫ్రంట్ పేజ్ బ్యాక్‌గ్రౌండ్ నలుపు రంగులో ఉండగా.. హెడ్‌లైన్స్, ఎడిటోరియల్స్ అన్నీ తెలుపు, ఎరుపు రంగులో ముద్రించారు. అలాగే ఈ ఘటనకు నిరసనగా పిలుపునిచ్చిన బంద్‌కు అన్ని వర్గాలు మద్దతు పలికాయి. కశ్మీర్‌లోయలో 35 ఏళ్లలో తొలిసారి ఈ స్థాయి మద్దతు లభించిందని అధికారులు తెలిపారు.
Read Also: Jammu Kashmir : ఉగ్రదాడి మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటన