Site icon HashtagU Telugu

Amit Shah : విపక్షాలకు కేంద్రహోంమంత్రి అమిత్‌ షా కౌంటర్‌

Amit Shah

Amit Shah

Amit Shah: విపక్షాలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మరోసారి విమర్శలు గుప్పించారు. విపక్షాలు(oppositions) ఏం చేసినా 2029లో మళ్లీ ఎన్డీయే అధికారంలోకి వస్తుందని, మోడీ ప్రధాని అవుతారని అమిత్‌ షా అన్నారు. తమ కూటమి ఐదేళ్ల కాలాన్ని పూర్తి చేసుకోవడమే కాదు.. 2029లోనూ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. చండీగఢ్‌లో 24×7 మణిమజ్ర నీటి సరఫరా ప్రాజెక్టును ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

We’re now on WhatsApp. Click to Join.

విపక్షాలను ఏమైనా అనుకోనివ్వండి.. మీరు (బీజేపీ శ్రేణులు) కంగారుపడొద్దు. 2029లోనూ ఎన్డీయే, నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తారని హామీ ఇస్తున్నా. కొంతమేర సాధించిన విజయంతో ప్రతిపక్షాలు గెలిచినట్లు భావిస్తున్నాయి. గత మూడు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎన్ని సీట్లు వచ్చాయో.. ఈ ఎన్నికల్లో (2024) బీజేపీ అంతకన్నా ఎక్కువ సీట్లు గెలుచుకున్న సంగతి వారికి తెలియదు. విపక్ష కూటమి సాధించిన సీట్లు కన్నా.. ఎన్డీయేలోని ఒక పార్టీ(బీజేపీ)కి వచ్చిన సీట్లే అధికమని వారు గుర్తించడం లేదు. అనిశ్చితి సృష్టించాలని కోరుకొనే వారంతా ఈ ప్రభుత్వం నడవదని పదే పదే మాట్లాడుతున్నారు. విపక్షాలకు చెందిన మిత్రులకు ఒక విషయం.. ఎన్డీయే ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేసుకోవడమే కాదు.. మరోసారి కూడా అధికారంలోకి వస్తుంది. ప్రతిపక్షంలో కూర్చొనేందుకు సిద్ధంగా ఉండండి. విపక్షంలో సమర్థంగా ఎలా పనిచేయాలో నేర్చుకోండి అని హితవు పలికారు.

Read Also: Govt Schools : ప్రభుత్వ స్కూల్స్ లలో కారం భోజనం పెడుతున్న రేవంత్ సర్కార్ – హరీష్ రావు