Site icon HashtagU Telugu

Digital Loans : డిజిటల్ లోన్స్‌పై కేంద్ర సర్కారు కీలక అప్‌డేట్

Google Pay Loan

Digital Loans

Digital Loans : డిజిటల్ లోన్స్ హవా నడుస్తోంది.  చాలామంది ఎగబడి వివిధ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ నుంచి లోన్స్ తీసుకుంటున్నారు. మరెంతో మంది వాటిని తీసుకునేందుకు క్యూ కడుతున్నారు. ఇలా క్యూ కట్టి డిజిటల్ లోన్స్ తీసుకొని.. ఆయా మొబైల్  యాప్స్ నుంచి ఎదురయ్యే వేధింపులు తట్టుకోలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.  ఈ యాప్స్ రుణాలను ఈజీగానే మంజూరు చేస్తున్నా.. వాటి రికవరీ విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో రుణాలు తీసుకున్న వారు ఒత్తిడికి లోనవుతున్నారు. లోన్ తిరిగి చెల్లించాలంటూ మితిమీరిన రేంజ్‌లో వేధింపులు ఎదురవుతుండటంతో వాటిని తాళలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. ఈ తరుణంలో కీలకమైన అప్‌డేట్ ఒకటి వచ్చింది.

We’re now on WhatsApp. Click to Join.

ఇలాంటి లోన్ యాప్స్‌ను, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లను నిషేధించడానికి కఠినమైన చట్టాన్ని తీసుకురావడానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. బాధ్యులను ఆదుకునేందుకు ఓ కొత్త మార్గాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇలాంటి అనేక నియంత్రణ లేని లోన్ ఆన్‌లైన్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిషేధించింది. ఇప్పుడు థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్లను నియంత్రించేందుకు కూడా ఆర్‌బీఐకి అనుమతులు ఇవ్వాలని కేంద్ర సర్కారు భావిస్తోంది. రుణ సంస్థల కోసం ఆర్‌బీఐ ఒక నియంత్రణ ఫ్రేమ్‌వర్క్‌ను(Digital Loans)  సిద్ధం చేసింది. దాని ప్రకారం.. సొంతంగా రుణాలు ఇచ్చే కంపెనీలను అది నియంత్రిస్తుంది. ప్రాథమిక అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌లు, స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌లు, కమర్షియల్ బ్యాంక్‌లు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (NBFC), డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌లు, హోమ్ ఫైనాన్స్ కంపెనీలతో (HFC) అన్ని అవుట్‌సోర్స్ ఎంపికలపై ఈ RBI నియమాలు వర్తిస్తాయి.