Site icon HashtagU Telugu

Nirmala Sitharaman: గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ఆర్థిక మంత్రి..రుణాలు, బ్యాంక్ అకౌంట్లు, పెన్షన్స్ పై కీలక ప్రకటన..!!

Nirmala Sitaraman

Nirmala Sitaraman

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్…గుడ్ న్యూస్ చెప్పారు. దేశంలో ఆర్థిక సమ్మిళిత వ్రుద్ధి లక్ష్యంగా మరో ముఖ్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దీన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఏడు ప్రాంతాలను ఎంపిక చేసింది కేంద్రం. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ప్రాంతం ఉండగా…తెలంగాణ నుంచి లేదు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపారు కేంద్ర ఆర్థిక మంత్రి. కటక్, ఔరంగాబాద్, పుణే, ఆంధ్రప్రదేశ్, కౌశాంబి, దాటియా, బర్పేటా, ప్రాంతాల్లో మొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. అక్టోబర్ 15, 2022 నుంచి నవంబర్ 26 వరకు ఈ కార్యక్రమం ఉండనుంది. ఈ కార్యక్రమం బాధ్యతలను డిపార్ట్ మెంట్ ఆఫ్ పైనాన్షియల్ సర్వీసెస్ చూసుకుంటుంది.

ఎంపిక చేసిన ఏడు ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు. ఈ ప్రత్యేక కార్యక్రమం 5 అంశాలే లక్ష్యంగా జరగనుంది. బ్యాంక్ అకౌంట్లు, ఇన్సూరెన్స్, పెన్షన్ స్కీమ్స్ అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తారు. ఇక ముద్రాలోన్స్ మరింత మందికి చేరువయ్యేలా చూస్తారు. పశుపోషణ, చేపల పెంపకంలో ఉన్నవారికి ముద్రా ప్రయోజనాలను అందించనున్నారు. ఇంకాపూర్తి KYCచేయడం ద్వారా బేసిక అకౌంట్స్ ను సాధారణ అకౌంట్స్ మార్చడంపై ద్రుష్టి పెట్టనున్నారు.

Exit mobile version