Union Budget 2025 : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం, ఆమె వివిధ రంగాలకు కేటాయింపులపై మాట్లాడారు. ఈ బడ్జెట్‌లో ఆరోగ్య రంగం కోసం ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చినట్టు ప్రకటించారు. ఆరోగ్య రంగంలో కీలకమైన కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు ఆమె తెలిపారు. ముఖ్యంగా, దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ కేన్సర్ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్టు వెల్లడించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే 200 జిల్లా కేంద్రాలలో కేన్సర్ కేంద్రాలు ఏర్పాటుచేసే ప్రణాళికను కేంద్రం ప్రకటించింది.
అదేవిదంగా, పీఎమ్ జన్ ఆరోగ్య యోజన కింద దేశంలోని గిగ్ వర్కర్ల కోసం ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా కోటి మంది గిగ్ వర్కర్లకు ఆరోగ్య సౌకర్యాలు అందించబోతున్నట్టు ఆమె చెప్పారు. అలాగే.. విద్య విధానంలో మార్పులు తీసుకువచ్చేందుకు కృసి చేస్తున్నామన్నారు. ఈ కొత్త ఆలోచనలు, పథకాలు దేశవ్యాప్తంగా ఆరోగ్య రంగాన్ని మెరుగుపర్చడంలో కీలకంగా మారనున్నాయన్నారు. దేశంలో పేదరికాన్ని పూర్తిగా రూపమాపడమే లక్ష్యంగా 2025-26 వార్షిక బడ్జెట్‌ను రూపొందించినట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆర్ధికవృద్ధి సాధిస్తోన్న దేశాల్లో భారత్ ఒకటని నిర్మల సీతారామన్ అన్నారు.
Nirmala Sitharaman: వరుసగా ఎనిమిదోసారి.. రికార్డులు బ్రేక్ చేయనున్న నిర్మలా సీతారామన్
ఇదే కాకుండా.. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు నిర్మలా సీతారామన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగించనున్నట్టు తెలిపారు. 2014 తర్వాత ఏర్పాటైన ఐఐటీలను విస్తరించనున్నట్టు తెలిపారు మంత్రి నిర్మల. గ్రామీణ ప్రాంతాల్లోని సెకెండరీ పాఠశాలలకు బ్రాడ్ బ్యాండ్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు నిర్మల సీతారామన్ పేర్కొన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో అటల్ టింకరింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారన్నారు. దేశంలోని ఐదు చోట్ల అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నైపుణ్య కేంద్రాలను ఏర్పాటుచేయనున్నట్టు తెలిపారు. ఇందులో ప్రపంచస్థాయి నిపుణులతో శిక్షణ ఇవ్వనున్నట్టు వెల్లడించారు.
దేశంలోని అన్ని జిల్లా ఆసుపత్రుల్లో కేన్సర్ సెంటర్లను ఏర్పాటుచేయనున్నట్టు మంత్రి నిర్మల తెలిపారు. వచ్చే మూడేళ్లలో దేశవ్యాప్తంగా ఇవి నెలకొల్పుతామని, ఈ వార్షిక సంవత్సరంలో 200 ఏర్పాటు చేస్తామని, గిగ్ వర్కర్లను ఈ-శ్రామ్ పోర్టర్‌లో రిజిస్టర్ చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడించారు. కోటి మంది గిగ్ వర్కర్లకు హెల్త్ కేర్ సపోర్ట్ అందిస్తామన్నారు.
Nirmala Sitharaman : దేశం అంటే మట్టి కాదు.. మనుషులు.. బడ్జెట్ సమావేశాల్లో నిర్మలమ్మ