దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ నివాసం వద్ద కలకలం రేగింది. అజిత్ ధోవల్ ఇంట్లోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి చొరబడేందుకు ప్రయత్నించగా, అక్కడి ఉన్న సెక్యూరిటీ, ఆ అగంతకుడిని అడ్డుకుని అదులోకి తీసుకుంది. ఈ క్రమంలో తనను వదిలేయాలని, అజిత్ దోవల్‌తో పని ఉందని, ఎలాగైనా మాట్లాడాలని, సెక్యూరిటీతో గట్టిగా వాగ్వాదానికి దిగాడు. దీంతో అతన్ని ప్రాథమిక విచారణ నిమిత్రం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో ఆ వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్న ఢిల్లీ స్పెషల్ పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు.
ప్రాథమిక దర్యాప్తులో భాగంగా అతను ఓ అద్దెకారు డ్రైవర్ అని పోలీసులు నిర్ధారించారు. భాగంగా తన శరీరంలో చిప్‌ను పెట్టారని, దాని ద్వారా తనను కంట్రోల్ చేస్తున్నట్లు ఆ వ్యక్తి పోలీసులకు చెప్పడంతో, స్పెషల్ పోలీసులు షాక్ అయ్యారు. విచారణలో భాగంగా ఆ వ్యక్తి చెబుతున్న సమాధానాలకు, అతని ప్రవర్తనకు పొంతనే లేకపోవడంతో వైద్యుల్ని పిలిపించారు. ఈ క్రమంలో ఆ వ్యక్తి మతిస్థిమితం సరిగ్గా లేదని, మానసికంగా కృంగిపోయి ఉన్నాడని, కర్నాటకకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారని సమాచారం. ఇక బుధవారం జన్‌పథ్‌లో అజిత్ ధోవల్ ఇంటి వద్ద జరిగిన ఈఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాశం అవుతోంది.