Op Sindoor Losses: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత విమానాలు కూలిపోయాయా?

సింగపూర్‌లో జరిగిన షాంగ్రీ-లా డైలాగ్ కార్యక్రమంలో సీడీఎస్ అనిల్ చౌహాన్ పాల్గొన్నారు. అక్కడ ఆయన పాకిస్తాన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. భారత్ ఎటువంటి వ్యూహం లేకుండా ఏ పనినీ చేయదని ఆయన అన్నారు.

Published By: HashtagU Telugu Desk
Op Sindoor Losses

Op Sindoor Losses

Op Sindoor Losses: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్.. ఆపరేషన్ సిందూర్ (Op Sindoor Losses) కింద పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఈ సమయంలో భారత వైమానిక దళం విమానాలు కూలిపోయాయా లేదా అనే విషయంపై చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) అనిల్ చౌహాన్ బ్లూమ్‌బెర్గ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యమైన సమాధానం ఇచ్చారు.

ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత విమానాలు కూలిపోయాయా?

ఈ ప్రశ్నకు సమాధానంగా సీడీఎస్ అనిల్ చౌహాన్ పాకిస్తాన్‌తో జరిగిన సంఘర్షణలో ఎన్ని జెట్‌లు కూలిపోయాయనేది అసలు విషయం కాదు? అవి ఎందుకు కూలిపోయాయి? దాని నుంచి ఏమి నేర్చుకున్నామనేది ముఖ్యమని అన్నారు. మాకు ‘టాక్టికల్ మిస్టేక్’ను అర్థం చేసుకునే అవకాశం లభించింది. ఆ తర్వాత మేము దానిని సరిదిద్ది, రెండు రోజుల్లోనే దీర్ఘ దూరం నుంచి లక్ష్యాలను ధ్వంసం చేస్తూ పాకిస్తాన్ శిబిరాలకు గట్టి సమాధానం ఇచ్చాము” అని ఆయన తెలిపారు.

Also Read: Suryakumar Yadav: ముంబై ఇండియ‌న్స్‌కు షాక్.. సూర్య‌కుమార్ యాద‌వ్‌కు గాయం?!

పాకిస్తాన్ దావాను సీడీఎస్ ఖండించారు

పాకిస్తాన్ 6 భారత యుద్ధ విమానాలను కూల్చినట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఇది నిజమేనా? ఈ వార్త‌ల‌ను సీడీఎస్ చౌహాన్ పూర్తిగా తోసిపుచ్చారు. “ఈ వార్త‌లు పూర్తిగా తప్పు. ఇక్కడ సంఖ్యలు ముఖ్యం కాదు. అవి ఎందుకు కూలాయి. మేము దాని నుంచి ఏమి నేర్చుకున్నాము? ఏమి సరిదిద్దామనేది ముఖ్యం” అని ఆయన అన్నారు. పాకిస్తాన్‌తో ఉద్రిక్తతల మధ్య ఎప్పుడూ పరమాణు ఆయుధాల వినియోగం అవసరం రాలేదని, ఇది ఊరట కలిగించే విషయమని ఆయన తెలిపారు.

అనిల్ చౌహాన్ పాకిస్తాన్‌పై విమర్శలు

సింగపూర్‌లో జరిగిన షాంగ్రీ-లా డైలాగ్ కార్యక్రమంలో సీడీఎస్ అనిల్ చౌహాన్ పాల్గొన్నారు. అక్కడ ఆయన పాకిస్తాన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. భారత్ ఎటువంటి వ్యూహం లేకుండా ఏ పనినీ చేయదని ఆయన అన్నారు. “పాకిస్తాన్‌తో దౌత్య సంబంధాలు కొనసాగించే రోజులు ముగిశాయి” అని ఆయన స్పష్టం చేశారు.

 

  Last Updated: 31 May 2025, 04:20 PM IST