Byjus Salaries : ప్రముఖ ఎడ్‌టెక్ కంపెనీ ‘బైజూస్’ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కంపెనీ తీవ్ర నగదు కొరతతో అల్లాడుతోంది. ఉద్యోగులకు శాలరీలు చెల్లించడం కూడా కష్టతరంగా మారింది. ఈ కష్టకాలంలో కంపెనీ ఉద్యోగులకు వేతనాలు చెల్లించడానికి ‘బైజూస్’ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్ తన ఇల్లు, తన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఇళ్లను బ్యాంకులో తాకట్టు పెట్టారని తెలుస్తోంది. ఇళ్లను తాకట్టు పెట్టగా వచ్చిన డబ్బులతో ప్రస్తుతం ఉద్యోగుల వేతనాలను ఇస్తున్నట్లు సమాచారం.
We’re now on WhatsApp. Click to Join.
బైజు రవీంద్రన్ తాకట్టు పెట్టిన స్థిరాస్తుల్లో బెంగళూరులోని రెండు ఇళ్లు, నగరంలోనే నిర్మాణ దశలో ఉన్న ఒక విల్లా ఉన్నాయి. వీటన్నింటిని తాకట్టు పెట్టి రూ.100 కోట్ల రుణాన్ని రవీంద్రన్ తీసుకున్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇలా వచ్చిన డబ్బుతో డిసెంబరు 4న (సోమవారం) ‘బైజూస్’ పేరెంట్ కంపెనీ ‘థింక్ & లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్’లోని 15వేల మంది ఉద్యోగులకు జీతాలు చెల్లించారట.
Also Read: MPPCC Chief : మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ ఔట్.. ? ఎందుకు ?
బైజూస్ అమెరికాలో పిల్లల కోసం ఒక డిజిటల్ రీడింగ్ ప్లాట్‌ఫామ్‌ను నిర్వహిస్తోంది. దాన్ని రూ.3వేల కోట్లకు విక్రయించే ప్రక్రియలో ప్రస్తుతం బైజు రవీంద్రన్ నిమగ్నమయ్యారు. మరోవైపు వివిధ బ్యాంకులు, ప్రైవేటు ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీల నుంచి తీసుకున్న రూ.10వేల కోట్ల అప్పులపై వడ్డీలు కూడా రవీంద్రన్ బకాయిపడ్డారు. దీంతో ఆ అప్పులు ఇచ్చిన వాళ్లంతా కోర్టుల ద్వారా ప్రొసీడ్ అవుతున్నారు. ఫలితంగా వాటిపై వివరణలు ఇచ్చేందుకు రవీంద్రన్ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.