UK Vs India : బ్రిటన్‌లోని 10 శాతం సంపన్నుల వద్ద భారత సంపద.. ఎందుకు ?

భారతీయుల తర్వాతి స్థానాల్లో బ్రిటన్ పౌరులు, పాకిస్తానీలు(UK Vs India) ఉన్నారు.

Published By: HashtagU Telugu Desk
Uk Vs India Uks Richest People Colonial Indias Wealth London

UK Vs India : బ్రిటీష్ వాళ్లు ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా మన భారతదేశం నుంచి భారీగానే బంగారాన్ని, డబ్బును దొంగిలించి తీసుకుపోయారు. ఖనిజ వనరులనూ అక్రమంగా తరలించుకున్నారు. యునైటెడ్ కింగ్‌డమ్(యూకే)ను సంపన్న దేశంగా మార్చుకున్నారు. 1765 సంవత్సరం నుంచి 1900 సంవత్సరం మధ్య కాలంలో భారత్ నుంచి తెల్లదొరలు 64.82 ట్రిలియన్ డాలర్లను దోచుకున్నారు.  1 ట్రిలియన్ డాలర్లు అంటే 86 లక్షల కోట్ల రూపాయలు. ఈ లెక్కన వాళ్లు ఎంత భారీ భారత సంపదను యూకేకు తరలించుకున్నారో మనం అర్థం చేసుకోవచ్చు.

Also Read :PAN Card Linked Loans : మీ పాన్‌కార్డుతో లింక్ అయిన రుణాల చిట్టా.. ఇలా తెలుసుకోండి

ఆ కార్పెట్‌తో.. 

యూకేలో ఉన్న అత్యంత సంపన్న కుటుంబాల్లో 10 శాతం  కుటుంబాల వద్ద భారత్ నుంచి తరలించుకున్న 33.8 ట్రిలియన్ డాలర్ల సంపద ఉందని పేర్కొంటూ ఆక్స్ ఫామ్ సంస్థ ఒక సంచలన నివేదికను విడుదల చేసింది. ఈ సంపదతో 50  పౌండ్ల బ్రిటీష్ నోటును కార్పెట్‌ అంత అతిభారీ సైజులో తయారు చేయించి లండన్ ఉపరితలంపై   నాలుగుసార్లు కప్పేయొచ్చట. డచ్ దేశం వాళ్లు కూడా భారత్ నుంచి బాగానే సంపదను దోచుకున్నారు.

Also Read :Bhairavam : సినిమాపై మరింత ఆసక్తి పెంచుతున్న ”భైరవం” టీజర్‌

మనోళ్లు రికవరీ చేస్తున్నారు

కట్ చేస్తే.. ప్రస్తుతం లండన్‌లో భారత సంతతి వారి హవా వీస్తోంది. అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తున్న వారిలో భారతి సంతతి వారే టాప్ ప్లేసుల్లో ఉన్నారు. భారతీయుల తర్వాతి స్థానాల్లో బ్రిటన్ పౌరులు, పాకిస్తానీలు(UK Vs India) ఉన్నారు. ఈమేరకు వివరాలతో బారెట్ లండన్ సంస్థ ఒక నివేదిక విడుదల చేసింది. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటూ  బ్రిటీష్ వారు దోచుకున్న భారత సంపదను, భారతీయులు రికవరీ చేస్తున్నారని కామెంట్లు పెడుతున్నారు. బ్రిటన్‌లో ఉన్న భారతీయులు మాత్రం ఈ వాదనతో ఏకీభవించడం లేదు. తాము బాధ్యతాయుతమైన బ్రిటన్ పౌరులుగా కష్టపడి వ్యాపారాలు, ఉద్యోగాలు చేస్తున్నామని అంటున్నారు. అక్రమ సంపాదనకు తాము దూరంగా ఉంటామని  తేల్చి చెబుతున్నారు.

  Last Updated: 20 Jan 2025, 07:35 PM IST