Aadhar Card: ఆధార్ కార్డు విషయంలో UIDAI కీలక నిర్ణయం.. ఇక నుంచి అది తప్పనిసరి

ఆధార్ కార్డు అనేది ప్రతిఒక్కరికీ తప్పనిసరిగా ఉండాల్సిన గుర్తింపు పత్రం. ఆధార్ కార్డు ఏ పని అవ్వదు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ కావాలన్నా, సిమ్ కార్డు కావాలన్నా, ప్రభుత్వ పథకాలు కావాలన్నా.

  • Written By:
  • Publish Date - January 10, 2023 / 08:28 PM IST

Aadhar Card: ఆధార్ కార్డు అనేది ప్రతిఒక్కరికీ తప్పనిసరిగా ఉండాల్సిన గుర్తింపు పత్రం. ఆధార్ కార్డు ఏ పని అవ్వదు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ కావాలన్నా, సిమ్ కార్డు కావాలన్నా, ప్రభుత్వ పథకాలు కావాలన్నా.. ఇలా ఏది కావాలన్నా ఆధార్ కార్డు అనేది తప్పనసరి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు.. ఇలా ప్రతిఒక్కరికీ ఆధార్ కార్డు అనేది కలిగి ఉండటం తప్పనిసరి అయింది. లేకపోతే చాలా పనులు అవ్వవు.

ఆధార్ కార్డుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త కొత్త నిబంధనలు తెస్తూ ఉంటుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం మరొ కొత్త నిబంధన తెచ్చింది. అదే ఆఫ్ లైన్ వెరిఫికేషన్. ఆధార్ ఆఫ్‌లైన్ వెరిపికేషన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఓవీఎస్ఈలు ఆఫ్‌లైన్‌లో ఆధార్ వెరిఫికేషన్ చేసే ముందు ఆధార్ కార్డు పొందిన వ్యక్తి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని యూఏడీఏఐ స్పష్టం చేసింది. ఈ మేరకు యూఏడీఏఐ మంగళవారం దీనిపై ప్రకటన విడుదల చేసింది.

ఆఫ్ లైన్ వెరిఫికేషన్ చేసే సంస్థలు ఇకపై తప్పనిసరిగా ఈ నిబంధనలను పాటించాలని తెలిపింది. ఆధార్ భద్రతకు సంబంధించి ప్రజల్లో నమ్మకం పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఆధార్ కార్డులపై ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి వెరిఫికేషన్ జరపాలని యూఏడీఏఈ తెలిపింది. ఆధార్ ను వెరిఫికేషన్ చేసే సంస్థలు తమ వెరిఫికేషన్ పూర్తి అయిన వినియోగదారులకు సంబంధించి వివరాలను ఉంచుకోకూడదని స్పష్టం చేసింది.

కాగా ఆధార్ కార్డు విషయంలో కేంద్ర ప్రభుత్వం అనేక మార్పులు చేస్తోంది. ఆధార్ కార్డును సులువుగా అప్డేట్ చేసుకునేలా ఆన్ లైన్ లో అవకాశం కల్పిస్తోంది. ఆన్ లైన్ లోకి వెళ్లి ఈజీగా మార్పులు, చేర్పులు చేసుకునేలా అవకాశం కల్పించింది.