Mrs Thackeray: రంగంలోకి సీఎం ఉద్ధవ్ భార్య.. రెబల్ ఎమ్మెల్యేల భార్యలతో చర్చలు

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ముదురుతోంది. శివసేన రెబల్ ఎమ్మెల్యేలు పట్టు వీడటం లేదు. అస్సాంలోని గౌహతి క్యాంప్ నుంచి బయటికి అడుగుపెట్టడం లేదు.

  • Written By:
  • Publish Date - June 26, 2022 / 11:54 AM IST

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ముదురుతోంది. శివసేన రెబల్ ఎమ్మెల్యేలు పట్టు వీడటం లేదు. అస్సాంలోని గౌహతి క్యాంప్ నుంచి బయటికి అడుగుపెట్టడం లేదు. “అవసరమైతే సీఎం పోస్టుకు రాజీనామా చేస్తా.. మీలోనే ఒకరిని సీఎం చేస్తా” అని ఉద్ధవ్ ఠాక్రే చెబుతున్నా రెబల్స్ ఎవరూ వినడం లేదు. ఏక్ నాథ్ షిండే తోనే ఉంటామని వారు తేల్చి చెబుతున్నారు. ఈనేపథ్యంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే భార్య రష్మీ ఠాక్రే రంగంలోకి దిగారు. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ముదురుతోంది. శివసేన రెబల్ ఎమ్మెల్యేలు పట్టు వీడటం లేదు. అస్సాంలోని గౌహతి క్యాంప్ నుంచి బయటికి అడుగుపెట్టడం లేదు. ఆమె ఇప్పుడు ఒక్కరొక్కరిగా రెబల్ ఎమ్మెల్యేల ఇంటికి వెళ్లి.. వాళ్ళ భార్యలతో మాట్లాడుతున్నారు. భర్తలకు నచ్చజెప్పి, గౌహతి నుంచి వచ్చేయాలని చెప్పమని విజ్ఞప్తి చేస్తున్నారు. సంక్షోభంలో పడిన భర్త ప్రభుత్వాన్ని మళ్లీ గట్టెక్కించేందుకు రష్మీ ఠాక్రే తనవంతుగా కృషి చేస్తున్నారు.

ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి..

మరోవైపు శివసేన రెబల్ ఎమ్మెల్యేలు తమ వర్గానికి “బాలా సాహెబ్” వర్గం అని పేరు పెట్టుకున్నారు. ఈనేపథ్యంలో శివసేన జాతీయ కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శివసేన పేరును, పార్టీ వ్యవస్థాపకుడు “బాలా సాహెబ్” పేరును మరెవరూ వాడుకోకుండా చూడాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. అలా వినియోగించే వారిపై చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది.

బలం.. బలగం..

మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 287 సీట్లు ఉన్నాయి. విశ్వాస పరీక్ష జరిగితే 144 ఓట్ల మ్యాజిక్ మార్క్ ను సాధించాల్సి ఉంటుంది. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలతో కూడిన “మహా వికాస్ అఘాడీ” కూటమి సంకీర్ణ ప్రభుత్వం 169 సీట్ల బలంతో గద్దెను ఎక్కింది. ఇప్పుడు సీన్ మారింది. ఏక్ నాథ్ షిండే రెబల్ క్యాంపులో 38 నుంచి 50 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం సంకటం లో పడ్డట్టే. భవిష్యత్ లో రెబల్ ఎమ్మెల్యేలు బీజేపీ లో విలీనమైనా.. రాజీనామా చేసినా మహా వికాస్ అఘాడీ సర్కారు కూలడం ఖాయం.