Stuck At 6000 Metres : ఇద్దరు పర్వతారోహకులు 6,015 మీటర్ల ఎత్తులో దాదాపు 3 రోజులు ఉండిపోయారు. ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ఉన్న చౌఖంబా III శిఖరంపైనే వారు ఒంటరిగా గడిపారు. ఈ అరుదైన అనుభవాన్ని అమెరికాకు చెందిన మిచెల్ థెరిసా డ్వోరాక్, యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన ఫావ్ జేన్ మానర్స్ ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు వారిద్దరిని ఆదివారం ఉదయం జిల్లా విపత్తు నిర్వహణ కేంద్రం సిబ్బంది(Stuck At 6000 Metres) రక్షించారు.
Also Read :Coffee Vs Cow Dung : మీ కాఫీలో ఆవు పేడ ఉందా ? ఆహార కల్తీలో ఆ రాష్ట్రమే నంబర్ 1
‘‘అక్టోబరు 3 నుంచి మేం చౌఖంబా III శిఖరంపైనే గడిపాం. కొంత ఆందోళనగా అనిపించింది. వాతావరణం ప్రతికూలించడంతో మేం అక్కడే ఇరుక్కుపోయాం. ఎట్టకేలకు స్థానిక రెస్క్యూ టీమ్ మమ్మల్ని కాపాడింది. రెస్క్యూ టీమ్ వాళ్లు రెండు భారత వాయుసేన హెలికాప్టర్ల ద్వారా పర్వతంపైకి వచ్చారు. అక్కడి నుంచి మమ్మల్ని రక్షించి పర్వతం కింది భాగంలోకి తెచ్చారు’’ అని ఆ ఇద్దరు పర్వతారోహకులు చెప్పుకొచ్చారు. తమను కాపాడిన రెస్క్యూ టీమ్‌కు వారు ధన్యవాదాలు తెలిపారు. దీంతో వీరిని రక్షించేందుకు శుక్రవారం నుంచి జరిగిన రెస్క్యూ వర్క్ సక్సెస్ అయింది.
Also Read :French Fries: ఫ్రెంచ్ ఫ్రైస్ ఎక్కువగా తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే!
మిచెల్ థెరిసా డ్వోరాక్, ఫావ్ జేన్ మానర్స్‌లు ఇండియా మౌంటెనీరింగ్ ఫౌండేషన్ ద్వారా ఈ పర్వతారోహణ యాత్రలో పాల్గొన్నారు. డెహ్రాడూన్‌లోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ ప్రకారం.. 6,995 మీటర్ల ఎత్తులో ఉన్న చౌఖంబ III శిఖరానికి వీరిద్దరు వెళ్తుండగా లాజిస్టికల్, టెక్నికల్ పరికరాలు కిందపడిపోయాయి. దీంతో వారు మళ్లీ కిందికి వచ్చే అవకాశం లేకుండాపోయింది. ఫలితంగా పర్వతంపైకి హెలికాప్టర్లను పంపి రెస్క్యూ చేయాల్సి వచ్చింది. చాలా ఎత్తైన పర్వత శిఖరంపై ప్రతికూల వాతావరణం నడుమ పర్వతారోహకులు కొంత అసౌకర్యాన్ని ఎదుర్కొంటారు.