PM Modi : నేను సభకు ఆలస్యంగా రావడానికి కారణం ఆ చిన్నారులే.. మోదీ వైరల్ వీడియో..!!

  • Written By:
  • Publish Date - November 28, 2022 / 07:52 AM IST

కొన్నాళ్లుగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలన్నీ కూడా జోరుగా ప్రచారం చేస్తున్నాయి. ప్రధానమంత్రి మోదీ కూడా పలు ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థలు కోసం ర్యాలీలు, భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఆదివారం కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రధాని. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇద్దరు చిన్నారులతో కలిసి మాట్లాడటం కనిపిస్తుంది. ప్రధానిని కలిసిన ఇద్దరు చిన్నారులు అనాథలు. గిరిజన నేపథ్యానికి చెందినవారు. వాళ్ల తండ్రి కొన్నేళ్ల క్రితం మరణించాడు. ఈ ఇద్దరు పిల్లలు ఇంజనీర్లు, కలెక్టర్లుగా ఎదగాలని కోరుకుంటున్నారు.

ఇదే విషయాన్ని గుజరాత్ లోని నేత్రంగ్ లో జరిగిన ర్యాలీలో మోదీ ప్రస్తావించారు. పెద్దయ్యాక ఇంజనీర్లు, కలెక్టర్లు కావాలనుకునే ఈ ఇద్దరు పిల్లలను కలవడం చాలా సంతోషంగా ఉంది. అందుకు ఈ సభకు నేను రావడం ఆలస్యమైందని కారణం చెప్పడంతో జనం చప్పట్లు కొట్టారు. జైని, అవీ ఇద్దరు గిరిజన సోదరులు ఒకరు 8, ఒకరు 7వ తరగతి చదువుతున్నారు. వారి తల్లిదండ్రులు అనారోగ్యంతో 6 సంవత్సరాల క్రితం మరణించారు. అప్పుడు వారి వయస్సు 8 ఏళ్లు. చిన్నారులకు అన్ని విధాలుగా అండగా ఉండాలని సీఆర్ పాటిల్ కు ప్రధాని ఫోన్ ద్వారా తెలిపారు. చిన్నారులకు సొంత ఇల్లుతోపాటు కనీస సౌకర్యాలు కల్పించేలా ప్రధాని చర్యలు తీసుకున్నారు.