Karnataka: కర్ణాటకలో కొత్త సీఎం ఎవరు..? డీకే శివకుమార్, సిద్ధరామయ్య కాకుండా సీఎం రేసులో మరో ఇద్దరు..!

కర్ణాటక (Karnataka)లో కాంగ్రెస్ ఘన విజయం తర్వాత సీఎం పదవి కోసం ఆ పార్టీలో కొత్త యుద్ధం మొదలైంది.

  • Written By:
  • Updated On - May 14, 2023 / 12:07 PM IST

కర్ణాటక (Karnataka)లో కాంగ్రెస్ ఘన విజయం తర్వాత సీఎం పదవి కోసం ఆ పార్టీలో కొత్త యుద్ధం మొదలైంది. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ (DK Shivakumar), సిద్ధరామయ్య (Siddaramaiah)మద్దతుదారులు ఇప్పటికే పోస్టర్ వార్ ప్రారంభించారు. తమ నాయకుడిని కర్ణాటక సీఎం చేయాలని మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే కర్ణాటక రాజకీయాల్లో సీఎం విషయంలో రెండు కొత్త పేర్లు తెరపైకి వచ్చాయి.

కర్ణాటక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామలింగా రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి పార్టీకి ఆశయాలు ఉంటాయి. కాంగ్రెస్‌లో డీకే శివకుమార్, సిద్ధరామయ్య మాత్రమే కాకుండా ఎంబీ పాటిల్, జీ పరమేశ్వర కూడా సీఎం కావాలనే ఆసక్తితో ఉన్నారని అన్నారు. అయితే ముఖ్యమంత్రి ఎవరన్నది పార్టీ హైకమాండ్, ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారని అన్నారు.

Also Read: Karnataka: కర్ణాటక నుంచి ఔట్.. బెడిసికొట్టిన బీజేపీ ‘మిషన్ సౌత్’

మంత్రి పదవిపై చర్చ

సీఎం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో త్వరలోనే అందరికీ వెల్లడిస్తానని రామలింగారెడ్డి తెలిపారు. అదే సమయంలో కొత్త ప్రభుత్వంలో తనకు మంత్రి పదవి దక్కడం ఖాయమని చెప్పారు.

కాగా.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 135, బీజేపీ 66, జేడీఎస్ 19, ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పలితాల్లో కాంగ్రెస్‌ పార్టీ తొలి నుంచి ఆధిక్యంలో నిలిచింది. ఆ పార్టీ ఆశించిన దాని కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించింది. కర్ణాటకలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 224. మ్యాజిక్ ఫిగర్ 113 స్థానాలు గెలిచిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుత రీతిలో ఫలితాలను సాధించింది. బీజేపీ తరఫున ప్రధాని మోదీ స్వయంగా ప్రచారం చేసినా ఫలితం దక్కలేదు. ఆ పార్టీ 66 స్థానాలకే పరిమితమైంది. ప్రభుత్వ ఏర్పాటులో కింగ్ మేకర్ పాత్రను పోషించాలనుకున్న కుమారస్వామి ఆశలు ఆవిరయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ దక్కడంతో జేడీఎస్ అవసరం ఆ పార్టీకి లేకపోయింది. కాంగ్రెస్ పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.