ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ (Time Magazine) తాజాగా విడుదల చేసిన ‘ప్రపంచంలోని అత్యుత్తమ ప్రదేశాలు’ (Best Places In The World) జాబితాలో భారతదేశం నుంచి రెండు హోటళ్లకు చోటు దక్కింది. రాజస్థాన్‌లోని జైపూర్ రాఫిల్స్ (Jaipur Raffles) మరియు మధ్యప్రదేశ్‌లోని బాంధవ్గఢ్‌లో ఉన్న ఒబెరాయ్ వింధ్యా విలాస్ వైల్డ్ లైఫ్ రిసార్ట్ (Oberoi Vindhyavilas Wildlife Resort)లు ఈ ప్రతిష్టాత్మక గుర్తింపును సాధించాయి. భారతదేశ పర్యాటక రంగానికి ఇది ఎంతో గర్వించదగ్గ విషయంగా చెప్పొచ్చు. ఈ హోటళ్లు తమ వైభవంతో పాటు, ఆకర్షణీయమైన సేవలు, సౌకర్యాలను అందిస్తూ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
Janasena Formation Day : హృదయపూర్వక శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ అన్న – లోకేష్
టైమ్ మ్యాగజైన్ ప్రకారం.. ఈ హోటళ్ల ప్రత్యేకతలు, అందమైన లోకేషన్‌లు, భవిష్యత్తులో ప్రాధాన్యతనిస్తూ రూపొందించిన సేవలే వీటిని ప్రపంచస్థాయి గుర్తింపును తెచ్చిపెట్టాయి. రాజస్థాన్‌లోని జైపూర్ రాఫిల్స్ అనేక రాజపుట కాలపు సాంప్రదాయాలను, ఆధునిక హాస్పిటాలిటీ సేవలను కలిపిన విలాసవంతమైన హోటల్‌గా పేరుగాంచింది. మరోవైపు ఒబెరాయ్ వింధ్యా విలాస్ వైల్డ్ లైఫ్ రిసార్ట్ అడవి వాతావరణాన్ని, నేచర్-ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్‌ను పర్యాటకులకు అందిస్తూ అనుభూతిని మరింత ప్రత్యేకంగా మారుస్తుంది.
అంతేకాదు ఈ జాబితాలో ముంబైలోని పాపాస్ రెస్టారెంట్‌ను కూడా చూడాల్సిన ప్రదేశం గా టైమ్ మ్యాగజైన్ సూచించింది. దేశంలోని పర్యాటక ప్రదేశాలు, మ్యూజియాలు, పార్కులు, హోటళ్లు వంటి అనేక విభాగాలను పరిగణనలోకి తీసుకొని టైమ్ ఈ జాబితాను విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించడంలో భారత్ మరింత ముందంజ వేస్తుండటంతో, ఇలాంటి గుర్తింపులు మరింత మంది టూరిస్టులను భారత్‌కు రప్పించడానికి దోహదపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.