Bill 252 : దేశం నలుమూలల నుంచి అయోధ్య రామమందిర దర్శనానికి వెళ్లే భక్తుల సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరుగుతోంది. అయితే ఇదే అదునుగా అయోధ్యలోని కొందరు హోటళ్ల నిర్వాహకులు టీ, టిఫిన్ల ధరలను అమాంతం పెంచేస్తున్నారు. తాజాగా అయోధ్యలోని శబరి రసోయి అనే రెస్టారెంట్ బిల్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెండు కప్‌ల టీ, రెండు బ్రెడ్ ముక్కలకే ఏకంగా రూ.252 లు ఛార్జ్ చేశారని అందులో స్పష్టంగా కనిపిస్తోంది. 2 టీలకు 110 రూపాయలు, 2 టోస్ట్‌లకు 130 రూపాయలను ఛార్జ్ చేశారని బిల్లును బట్టి తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ బిల్లును చూసిన నెటిజన్స్.. ‘ఇంత ధరను ఛార్జ్ చేస్తారా’ అంటూ మండిపడుతున్నారు. ఇక రెస్టారెంట్‌లో టిఫిన్లు, భోజనాలు చేస్తే వేలల్లోనే బిల్లు వేస్తారేమో అని కామెంట్స్ పెడుతున్నారు. మరీ ఇంత అన్యాయం ఉంటుందా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.చివరికి ఈ వ్యవహారం మొత్తం అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీకి చేరింది. దీంతో ఆ హోటల్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 3 రోజుల్లోగా ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని రెస్టారెంట్‌కు ఆదేశాలు జారీ చేసింది. లేదంటే హోటల్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరికలు చేసింది.
Also Read :Brain Chip : తొలిసారిగా మనిషి మెదడులోకి చిప్.. ఎందుకు ? ఏమిటి ? ఎలా ?
అయోధ్య రామమందిర దర్శన సమాచారం ఇదీ..
1. రామమందిర దర్శన సమయం ఎప్పటినుంచి ఎప్పటివరకు?
ఉదయం 7 గంటల నుంచి ఉదయం 11.30 గంటల వరకు దర్శననానికి అనుమతిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అనుమతి ఉంటుంది.
2. ఆరతి దర్శనానికి సమయాలేంటి?
రామ్ లల్లా విగ్రహానికి శృంగార్ ఆరతి (ప్రార్థన) ఉదయం 6:30 గంటలకు మొదలవుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు భోగీ ఆరతి ఉంటుంది. రాత్రి 7.30 గంటల నుంచి సంధ్య ఆరతి కోసం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
3. ప్రవేశానికి ఎంట్రీ ఫీజు ఏమైనా ఉంటుందా?
రామమందిర దర్శనానికి వచ్చే భక్తులకు సాధారణ ప్రవేశానికి ఎలాంటి ఫీజు లేదు. ఉచిత ప్రవేశానికి అనుమతి ఉంటుంది.
4. ప్రవేశానికి ఏదైనా పాస్ అవసరమా?
ఆలయ ప్రవేశానికి ముందుగా ఆన్‌లైన్ ద్వారా పాస్ తీసుకోవాలి. అందులో ప్రత్యేకించి ఆరతి దర్శనం కోసం పాస్ తప్పనిసరిగా ఉండాలి.
5. ఆరతి దర్శన పాస్‌కు ఎంత చెల్లించాలి?
ఆరతి దర్శనానికి తప్పనిసరిగా పాస్ ఉండాలి. కానీ, ఆరతి దర్శనం ఉచితంగా భక్తులకు అనుమతి ఉంటుంది.
6. ఆరతి లేదా దర్శనానికి టికెట్లను ఎలా బుక్ చేసుకోవాలి?
ఆరతి లేదా బాలరాముని దర్శనానికి టికెట్లను ఆలయ వెబ్‌సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. https://online.srjbtkshetra.org వెబ్ సైట్ ద్వారా దర్శన టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చు.