Anantnag Encounter: జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందగా, ముగ్గురు సైనికులు, ఇద్దరు పౌరులతో సహా మరో ఐదుగురు గాయపడ్డారు.కోకెర్‌నాగ్‌లోని అహ్లాన్ గండోల్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో గాయపడిన ఇద్దరు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందారని అధికారులు తెలిపారు.
ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు సైనికులు, ఇద్దరు పౌరులు సహా ఐదుగురు గాయపడ్డారని ఓ అధికారి తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు మరియు భద్రతా దళాల బృందం అహ్లాన్‌లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ జరిపారు. ఈ సమయంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. భద్రతా బలగాలు కూడా ఎదురుకాల్పులు జరిపాయి. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పౌరులు కూడా గాయపడ్డారు, ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది అని ఆర్మీ అధికారులు చెప్పారు.
గత ఏడాది కాలంలో కోకెర్‌నాగ్‌లో శనివారం జరిగిన రెండో అతిపెద్ద ఎన్‌కౌంటర్. సెప్టెంబరు 2023లో కోకెర్‌నాగ్ అడవుల్లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కమాండింగ్ ఆఫీసర్, మేజర్ మరియు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రాణాలు కోల్పోయారు.ఇటీవలి కాలంలో కాశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య పలుచోట్ల ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. వీటిలో చాలా మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
Also Read: Monarch Tractors: హైదరాబాద్‌లో మోనార్క్ ట్రాక్టర్స్ విస్తరణకు ప్రణాళిక!