Site icon HashtagU Telugu

IT Deadline:ట్విట్ట‌ర్ ట్రెండ్ : ఐటీ రిట‌ర్న్ దాఖ‌లు గ‌డువు పొడిగించాల‌ని డిమాండ్‌

Income Tax Imresizer

Income Tax Imresizer

2020-21 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలు గడువు మూడు రోజుల్లో ముగియనుండడంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఫైలింగ్ తేదీని పొడిగించే అభ్యర్థనలను పరిశీలిస్తోంది. పొడిగింపు కోసం ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. రిటర్న్‌లు దాఖలు చేయడానికి ప్రస్తుత గ‌డువు ఈ నెల ఆఖ‌రి వ‌ర‌కు ఉంది. క‌రోనా మహమ్మారి కారణంగా ప్రభుత్వం అన్ని ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి గడువు తేదీని జూలై 31 నుండి ఐదు నెలల పాటు పొడిగించింది. ప్రస్తుతం సగటున గంటకు దాదాపు 1 లక్ష రిటర్న్‌లు దాఖలు అవుతున్నాయి. రిటర్న్‌లు దాఖలు చేయడానికి చివరి తేదీని తాజాగా పొడిగించడంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆ శాఖ‌ అధికారి తెలిపారు. సోమవారం వరకు 46.7 మిలియన్ల ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలయ్యాయని అంచనా వేయగా..అదే రోజు 1.54 మిలియన్లకు పైగా ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలయ్యాయని ఆదాయపు పన్ను శాఖ ట్వీట్‌లో తెలిపింది. ఆదాయపు పన్ను పోర్టల్‌లో లోపాలు, అవాంతరాలు ఎదురవుతున్నాయని పలువురు సోషల్ మీడియా వినియోగదారులు ఫిర్యాదు చేయడంతో, ఫైలింగ్ గడువును పొడిగించాలనే డిమాండ్ ట్విట్టర్‌లో ట్రెండ్ అయ్యింది. చాలా మంది వినియోగదారులు ఫైల్ చేసే ప్రక్రియలో తాము స్వీకరించినట్లు క్లెయిమ్ చేసిన ఎర్రర్ మెసేజ్‌ల స్క్రీన్‌షాట్‌లను పోస్ట్ చేసారు. కొంతమంది ట్యాక్స్ ప్రాక్టీషనర్లు ఐదు, ఆరు, ఏడు రిటర్న్ ఫారమ్‌లతో సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

Exit mobile version