వరల్డ్ వైడ్ గా కోవిడ్ కేసులు భారీగానే తగ్గాయి. కోవిడ్ కారణంగా ఇంటినుంచే వర్క్ చేయాలని ఉద్యోగులకు ఐటీ కంపెనీలు అనుమతిచ్చాయి. అయితే ఇప్పుడు తమ ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు రావాల్సేందేనని అంటున్నాయి. కోవిడ్ తీవ్రత తగ్గడంతో ఇంట్లో వర్క్ చేసింది చాలు…ఇక ఆఫీసుల్లోనే పనిచేయాలంటూ ఉద్యోగులకు సూచిస్తున్నాయి. గూగుల్ ట్విట్టర్ తో పాటు కొన్ని పెద్ద టెక్ కంపెనీలు…వర్క్ ఫ్రం హోం విధానాలకు ఎండ్ కార్డునిచ్చాయి. గూగుల్ తర్వాత ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ వేదికగా తమ ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రావాల్సిందేనని తెలిపారు. ఉద్యోగులను ఈ నెల 15లోపు ఆఫీసులకు తిరిగా రావాలని కోరారు.
ఇప్పటివరకు మూతపడిన ఆఫీసులన్నీ తిరిగి ప్రారంభం అవుతున్నాయని…వ్యాపార కార్యకలాపాలు ఎప్పటిలాగే తిరిగి ప్రారంభం అవుతున్నాయని…మిగతా ఐటీ కంపెనీల వలే ట్విట్టర్ ఆఫీసులు కూడా మార్చి 15 నుంచి పున:ప్రారంభం అవుతున్నాయని ఉద్యోగులకు అగర్వాల్ ఈ మెయిల్ పంపారు. ఇక ఇన్నాళ్లూ ఉద్యోగుల సౌకర్యాన్ని ద్రుష్టిలోఉంచుకుని ఫ్రం హోం అవకాశాన్ని కలిపించినట్లు చెప్పారు. ట్విట్టర్ ఉద్యోగుల కోసం వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఇప్పటికీ ఇంకా అందుబాటులో ఉందన్నారు. ఇంటి నుంచే పనిచేయడం కన్నా…ఆఫీసు నుంచి పనిచేసే ఉద్యోగులకే ఎక్కువ ప్రయోనాలకు అర్హులవుతారన్నారు. కోవిడ్ 19 కారణంగా గత రెండు సంవత్సరాలుగా ట్విట్టర్ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కంపెనీ ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ట్విట్టర్ సీఈవో ప్రస్తావించారు. రానున్న ఈ నెలరోజులు ఉద్యోగులకు ఎన్నో సవాళ్లుంటాయన్నారు.
ఎప్పటిలాగే ఉద్యోగులు ఆఫీసులకు అలవాటు కావాలని సూచించారు. లాజిస్టిక్స్, తేదీలు, భద్రతా చర్యలకు సంబంధించి కంపెనీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్న వివరాలు తొందర్లోనే ఉద్యోగులకు తెలియజేస్తామని స్పష్టం చేశారు. ఇక గూగులో సైతం ఏప్రిల్ 4 నుంచి ఉద్యోగులు ఆఫీసులకు రావాల్సిందేనని చెప్పిన సంగతి తెలిసిందే. హైబ్రిడ్ వర్క్ పాలసీ ఆధారంగా ఎంప్లాయిస్ ను ఆఫీసులకు రప్పిస్తోంది. అంటే అన్ని రోజుల్లో ఆఫీసుల్లోనే పనిచేయాలని అవసరం లేదన్నమాట.
