Site icon HashtagU Telugu

UP: కదులుతున్న రైల్లో నుంచి జవాన్ను తోసేసిన టీటీ..రెండు కాళ్లు కోల్పోయిన జవాన్..!!

Trains

Trains

ఉత్తరప్రదేశ్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆర్మీ జవాన్ను కదులుతున్న రైల్లో నుంచి తోసివేశాడు టీటీఈ. దీంతో పట్టాలపై పడ్డ జవాను రెండు కాళ్లు విరిగిపోయాయి. వెస్ట్ బెంగాల్ దిబ్రూగడ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కేందుకు యూపీలోని బరేలీ స్టేషన్ కు చెందిన జవాన్ వచ్చాడు. రైలు ఎక్కుతుండగా..జవాన్ కు టీటీకి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో రైలు కదులుతుండగా రైలు ఎక్కేందుు జవాన్ ప్రయత్నించాడు. జవాన్ను అడ్డుకున్న టీటీఈ కిందికి తోసేశాడు. రైలు కిందపడిన జవాన్ ..రెండు కాళ్లు కోల్పోయాడు.

విషయం తెలుసుకున్న తోటి జవాన్లు స్టేషన్ లో ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. టీటీఈపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. అక్కడి నుంచి టీటీఈ తప్పించుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గాయపడిన జవాన్ను ఆసుపత్రికి తరలించారు. రెండు కాళ్లను కోల్పోయిన జవాన్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.

Exit mobile version