Mughlai Aloo Recipe: మధ్యాహ్నం లంచ్‎లోకి ఏం కర్రీ చేయాలని ఆలోచిస్తున్నారా? మొఘలాయ్ ఆలూ రెసీపీ ట్రై చేయండి. టేస్ట్ అదిరిపోవాల్సిందే.

  • Written By:
  • Updated On - April 25, 2023 / 11:17 PM IST

ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత మధ్యాహ్నం (Mughlai Aloo Recipe)లంచ్ కు ఏం చేయాలని చాలా మంది మహిళలు ఆలోచిస్తుంటారు. ఇది అందరి ఇళ్లలోనూ సాధారణంగా జరిగేదే. పప్పు, చారు, టమోటా ఇలాంటి కూరలు సాధారణంగా వండుతూనే ఉంటాయి. ఇక వీకెండ్ వచ్చిందంటే నాన్ వెజ్ ఘుమఘుమలాడాల్సిందే. పప్పు, పప్పుచారు, టమోటా ఇలాంటి వంటకాలు తిని బోర్ కొట్టిందా. అయితే ఈరోజు మధ్యాహ్నం భోజనంలోకి మొఘలాయి ఆలూ కర్రీ ట్రై చేసి చూడండి. చేయడానికి కాస్త సమయం తీసుకున్నప్పటికీ…రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది.

మొఘలాయ్ ఆలూ రెసీపీ ఎలా తయారు చేస్తారో చూద్దాం.

-రెసిపీ రెడీ చేయడానికి మీకు కావాల్సింది బేబి బంగాళదుంపలు.

-బేబి బంగాళదుంపలు నీటిలో నానపెట్టి వాటిని ఉడకపెట్టండి. పదినిమిషాల పాటు ఉడికిన తర్వాత వాటిమీదున్న పొట్టు తీసేయండి.

-పెరుగు వడకట్టి, అందులో ఉప్పు వేసి పక్కన పెట్టుకోవాలి.

-ఇప్పుడు బాణలిలో నెయ్యి వేసి వేడి చేయాలి. కట్ చేసిన ఉల్లిపాయలు ముదురు బంగారు రంగులోకి వచ్చేలా ఫ్రై చేయాలి.

-అందులో అల్లం వెల్లుల్లి పేస్టు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.

-ఇప్పుడు కొంచెం పసుపు వేసి, బంగాళదుంపలు వేయాలి. అందులో కొంచెం అన్ని కలిపి తయారు చేసిన మసాల పొడి, ధనియా పొడి వేసి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి.

-ఇప్పుడు అందులో కొంచె నీళ్లు పోయాలి. బంగాళదుంపలు మెత్తబడే వరకు ఉడికించాలి.

-అందులో ముందుగా తయారు చేసుకున్న పెరుగు వేయాలి. గ్రేవి చిక్కగా వచ్చే వరకు ఉడికించాలి.

-చివరగా కొంచెం క్రీము వేసి కొత్తిమీరతో అలంకరించాలి.

-ఈ రెసిపిని చపాతీలు లేదా అన్నంలో సర్వ్ చేసుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.