పండగపూట తీవ్ర విషాదం, ట్రావెల్ బస్‌ను ఢీ కొట్టిన కంటెయినర్‌ 20 మంది సజీవ దహనం

పండగపూట తీవ్ర విషాదం నెలకొంది. కర్ణాటకలో జరిగిన ఘోర బస్సు ప్రమాద దృశ్యాలు చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తోంది. చిత్రదుర్గ జిల్లా గోర్లతు గ్రామంలో ఈ ఘటన జరిగింది.

Published By: HashtagU Telugu Desk
Karnataka Bus Accident

Karnataka Bus Accident

  • చిత్రదుర్గ జిల్లా గోర్లతు గ్రామంలో ఈ ఘటన జరిగింది
  • బస్సులో మొత్తం 32 మంది, 21 మంది సజీవ దహనం
  • ప్రవైట్ ట్రావెల్ బస్సు ను ఢీ కొట్టిన కంటెయినర్

క్రిస్మస్ వేడుకల సంబరాల్లో ఉండాల్సిన సమయంలో చిత్రదుర్గ జిల్లాలో జాతీయ రహదారి-48పై మృత్యువు విలయతాండవం చేసింది. సీబర్డ్‌ ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సు బెంగళూరు నుంచి గోకర్ణ వైపు వెళ్తుండగా, గురువారం తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో ఈ ఘోర ప్రమాదం సంభవించింది. ఎదురుగా అతివేగంతో వస్తున్న ఒక కంటెయినర్ లారీ ఒక్కసారిగా అదుపు తప్పి, డివైడర్‌ను దాటుకుంటూ వచ్చి బస్సును బలంగా ఢీకొట్టింది. ఆ సమయంలో ఉన్న దట్టమైన పొగమంచు, లారీ డ్రైవర్ అజాగ్రత్తే ఈ ప్రమాదానికి ప్రాథమిక కారణాలని తెలుస్తోంది. ఢీకొన్న వేగానికి సెకన్ల వ్యవధిలోనే రెండు వాహనాల్లో మంటలు చెలరేగి, బస్సును అగ్నిగోళంగా మార్చేశాయి.

Karnataka Bus Accident2

బస్సులోని 32 మంది ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే మంటలు బస్సు మొత్తాన్ని చుట్టుముట్టాయి. దట్టమైన పొగ కమ్మేయడంతో ఊపిరాడక, బయటకు వచ్చే దారి తెలియక ప్రయాణికులు హాహాకారాలు చేశారు. దురదృష్టవశాత్తూ 20 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. బస్సు డ్రైవర్, క్లీనర్ మంటల నుంచి తప్పించుకోగా, మరికొందరు ప్రయాణికులు ప్రాణభయంతో కిటికీ అద్దాలు పగులగొట్టుకుని బయటకు దూకారు. తమ కళ్ల ముందే తోటి ప్రయాణికులు, బంధువులు అగ్నికి ఆహుతవుతుంటే వారు చూస్తూ ఉండిపోవడం మినహా ఏమీ చేయలేకపోయారు.

సహాయక చర్యలు మరియు మృతుల గుర్తింపు ఘటన గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో వారిని గుర్తించడం అధికారులకు సవాలుగా మారింది.

  Last Updated: 25 Dec 2025, 09:45 AM IST