Site icon HashtagU Telugu

Law Minister Kiren Rijiju: కేంద్రమంత్రికి తప్పిన పెను ప్రమాదం.. కిరణ్ రిజిజు కారును ఢీకొట్టిన ట్రక్కు

Kiren Rijiju

Resizeimagesize (1280 X 720)

జమ్మూ కాశ్మీర్‌లోని బనిహాల్ సమీపంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) బుల్లెట్ ప్రూఫ్ కారును లోడుతో కూడిన ట్రక్కు ఢీకొట్టింది. కేంద్ర మంత్రి కారుకు కొంత నష్టం వాటిల్లింది. శనివారం (ఏప్రిల్ 8) జరిగిన ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. కేంద్రమంత్రి కారుకు ప్రమాదం జరిగినట్లు పోలీసులు కూడా నిర్ధారించారు.

జమ్మూ నుంచి శ్రీనగర్‌కు రోడ్డు మార్గంలో వెళ్తుండగా కేంద్ర మంత్రి రిజిజు కారు స్వల్ప ప్రమాదానికి గురైందని రాంబన్ పోలీసులు తెలిపారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, మంత్రిని సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చామని పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చిన యాక్సిడెంట్ వీడియోలో కారు ట్రక్కు వెనుక భాగంలో ఢీకొట్టినట్లు కనిపిస్తోంది. కొంతమంది భద్రతా సిబ్బంది సైట్ వైపు పరుగులు తీస్తున్నారు. అదే సమయంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా భద్రతా వలయంలో కనిపిస్తున్నారు.

Also Read: Pawar shocked the Congress: కాంగ్రెస్‌కు షాకిచ్చిన పవార్‌

జమ్మూ కాశ్మీర్ పర్యటనలో కిరణ్ రిజిజు

కొన్ని కార్యక్రమాలకు హాజరు కావడానికి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు శనివారం జమ్మూ కాశ్మీర్ చేరుకున్నారు. సమాచారం ప్రకారం.. డోగ్రీ భాషలో భారత రాజ్యాంగం మొదటి ఎడిషన్ జమ్మూ విశ్వవిద్యాలయంలో విడుదలైంది. ఈ కార్యక్రమానికి రిజిజును ఆహ్వానించారు. ఇది కాకుండా జమ్మూ నుంచి ఉధంపూర్‌కు ‘లీగల్ సర్వీస్ క్యాంపు’లో చేరేందుకు వెళ్తున్నట్లు రిజిజు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయనిర్ణేతలు, నల్సా బృందంతో పాటు పలువురు కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు పాల్గొంటున్నారని తెలిపారు.