Election Results 2023: ఉత్కంఠ.. నేడు ఆ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు..!

నేడు త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ ఎన్నికల ఫలితాలు (Election Results) వెల్లడికానున్నాయి. గతనెల 16న 60 స్థానాలకు త్రిపుర ఎన్నికలు జరగగా.. 27న నాగాలాండ్, మేఘాలయాలో చెరో 59 స్థానాలకు పోలింగ్ జరిగింది.

  • Written By:
  • Updated On - March 2, 2023 / 06:54 AM IST

నేడు త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ ఎన్నికల ఫలితాలు (Election Results) వెల్లడికానున్నాయి. గతనెల 16న 60 స్థానాలకు త్రిపుర ఎన్నికలు జరగగా.. 27న నాగాలాండ్, మేఘాలయాలో చెరో 59 స్థానాలకు పోలింగ్ జరిగింది. తమిళనాడులోని ఈరోడ్, బెంగాళ్‌లోని సాగర్‌దిఘి, జార్ఖాండ్‌లోని రామ్‌గఢ్, మహారాష్ట్రలోని చించ్‌వాడ్, కస్బా పేట నియోజకవర్గాలకు ఇటీవల జరిగిన బైపోల్స్ ఫలితాలు కూడా నేడు వెల్లడికానున్నాయి.

త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మూడు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపునకు సన్నాహాలు పూర్తయ్యాయి. దీంతో పాటు మహారాష్ట్రలోని కస్బా పేట, చించ్‌వాడ్ అసెంబ్లీ స్థానాలు, తమిళనాడులోని ఈరోడ్-తూర్పు, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్‌దిఘి, జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా ఈరోజు రానున్నాయి. త్రిపుర ఒకే దశలో ఫిబ్రవరి 16న, మేఘాలయ, నాగాలాండ్‌లలో ఫిబ్రవరి 27న ఎన్నికలు జరిగాయి.

త్రిపురలో ఓట్ల లెక్కింపునకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు త్రిపుర ప్రధాన ఎన్నికల అధికారి బుధవారం తెలిపారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఐదు నుంచి ఎనిమిది రౌండ్ల కౌంటింగ్ పూర్తవుతుంది. మధ్యాహ్నానికి ట్రెండ్స్‌పై స్పష్టత వస్తుందని చెప్పారు. త్రిపుర అసెంబ్లీలోని మొత్తం 60 స్థానాల్లో 89.90 శాతం పోలింగ్ నమోదైంది. వివిధ పార్టీల నుంచి మొత్తం 259 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అధికార బీజేపీ-ఐపీఎఫ్‌టీ కూటమి, లెఫ్ట్‌-కాంగ్రెస్‌ కూటమి మధ్యే ప్రధాన పోటీ నెలకొని ఉంది.

Also Read: Whatsapp: 29 లక్షల వాట్సాప్ అకౌంట్లు నిషేధం.. కారణమిదే..?

మేఘాలయలోని 59 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 27న జరిగిన ఎన్నికల ఫలితాలు కూడా నేడు వెల్లడికానున్నాయి. ఎగ్జిట్ పోల్స్ నమ్మితే ఈసారి రాష్ట్రంలో హంగ్ ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మాకు చెందిన నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పిపి)కి ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు వస్తాయని అంచనా. మీడియా నివేదికల ప్రకారం.. ఓట్ల లెక్కింపుకు ముందు ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా గౌహతిలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మను కలిశారు.

నాగాలాండ్ గురించి మాట్లాడితే.. ఈసారి కూడా అధికార BJP, నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (NDPP) కూటమికి మెజారిటీ వస్తుందని పోల్స్ పేర్కొన్నాయి. 60 మంది సభ్యులున్న అసెంబ్లీలో ఎన్డీపీపీ 40 స్థానాల్లో పోటీ చేయగా, బీజేపీ 20 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. నాగాలాండ్ ఎన్నికల ఫలితాలు కూడా నేడు వెల్లడికానున్నాయి.