Site icon HashtagU Telugu

828 HIV Cases : ఎయిడ్స్‌తో 47 మంది స్టూడెంట్స్ మృతి

HIV And AIDS

828 HIV Cases : దేశంలోని ఈశాన్య రాష్ట్రం త్రిపురలో ప్రమాదకర హెచ్‌ఐవీ ఎయిడ్స్ విజృంభిస్తోంది. నిర్లక్ష్య వైఖరి, క్షణికానందం కారణంగా త్రిపురలోని ఎంతోమంది విద్యార్థులు ఎయిడ్స్ బారినపడుతున్నారు. ఈ రాష్ట్రంలోని 828 మంది విద్యార్థులకు హెచ్‌ఐవీ పాజిటివ్ నిర్ధారణ కాగా.. వారిలో దాదాపు 47 మంది వ్యాధి ముదిరి చనిపోయారు. ఈవిషయాన్ని త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వెల్లడించింది.

We’re now on WhatsApp. Click to Join

త్రిపురలో హెచ్‌ఐవీ పాజిటివ్ నిర్ధారణ అయిన 828 మంది విద్యార్థుల్లో 572 మంది ఇంకా రాష్ట్రంలోనే ఉన్నారు. 47 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. మిగతా విద్యార్థులంతా ఉన్నత విద్య కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లారు. త్రిపురలోని 220 స్కూళ్లు, 24 కాలేజీలకు చెందిన విద్యార్థులు ఇంజెక్షన్ డ్రగ్స్‌కు బానిసలుగా మారారని రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ గుర్తించింది. త్రిపురలో మొత్తం 8,729 ఎయిడ్స్ యాక్టివ్ కేసులు ఉన్నాయి.  వీరిలో ప్రస్తుతం 5,674 మంది బతికే ఉన్నారు. బాధితుల్లో 4,570 మంది పురుషులు, 1,103 మంది స్త్రీలు, ఒక లింగమార్పిడి వ్యక్తి ఉన్నారు.

Also Read :Iran New President : ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా మసౌద్ పెజెష్కియాన్.. వాట్స్ నెక్ట్స్ ?

హెచ్ఐవీ ఉన్నవారందరికీ ఎయిడ్స్ వస్తుందా?

హెచ్‌ఐవీ ఉన్న ప్రతి ఒక్కరికీ ఎయిడ్స్ రాదు. హెచ్ఐవీ సోకితే అది ఎయిడ్స్‌కు దారి తీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హెచ్ఐవీ ఉన్నవారికి తరచూ అంటువ్యాధులు, తీవ్ర స్థాయిలో ఇన్ఫెక్షన్లు సోకుతాయి. వీరి రక్తంలో తెల్ల రక్తకణాల (CD4 కణాలు) సంఖ్య  బాగా పడిపోయే రిస్క్ ఉంటుంది. ఒకవేళ అదే జరిగితే వారికి ఎయిడ్స్ సోకినట్టు వైద్యులు కన్ఫార్మ్ చేస్తారు. హెచ్‌ఐవీ సోకిందని తెలుసుకోవడానికి రక్తపరీక్ష ఒక్కటే మార్గం. హెచ్ఐవీని ఎంత తొందరగా గుర్తిస్తే అంత తొందరగా వైరస్ లక్షణాలను తగ్గించే చికిత్స ప్రారంభించవచ్చు.

Also Read :UK Elections: బ్రిట‌న్ ఎన్నిక‌లు.. భార‌త సంత‌తికి చెందిన 28 మంది గెలుపు..!

హెచ్ఐవీ లక్షణాలు ఏమిటి?

హెచ్ఐవీ సోకిన వారిలో పలు దశలు ఉంటాయి.  ఒక్కో దశలో ఒక్కో రకమైన లక్షణాలు బయటికి కనిపిస్తాయి. తొలి దశలలో వైరస్ లక్షణాలు బయటపడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. చాలామందికి వైరస్ సోకినట్టు తెలియడానికి ఎక్కువ టైం పడుతుంది. హెచ్ఐవీని ఎంత తొందరగా గుర్తిస్తే.. చికిత్సను అంత తొందరగా మొదలుపెట్టొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్నింగ్ ఇస్తోంది. హెచ్‌ఐవీ సోకిన తర్వాత కొంతమందిలో జ్వరం, తలనొప్పి, శరీరంపై దద్దుర్లు, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. గొంతులో గగ్గలు దిగడం, బరువు తగ్గడం, జ్వరం, విరేచనాలు, దగ్గు లాంటి లక్షణాలు కూడా కనిపించే ఛాన్స్ ఉంది.