Site icon HashtagU Telugu

Travel Insurance: రూ.10 లక్షల బీమా గురించి మీకు తెలుసా? రైల్వే ప్రయాణికులకు అలర్ట్!

Travel Insurance Rules By Irctc 800x450

Travel Insurance Rules By Irctc 800x450

Travel Insurance: వరల్డ్ లోనే అతి పెద్ద రైల్వే నెట్ వర్క్ లో ఇండియన్ రైల్వే మొదటి స్థానంలో ఉంది. రోజూ లక్షలాది మంది రైళ్లలో ప్రయాణాలు సాగిస్తున్నారు. ఇతర రవాణాలతో పోలిస్తే ఈ రైళ్లలో ప్రయాణం చాలా చౌకగా ఉంటుంది. అంతేకాకుండా వేగంగా కూడా ప్రయాణాలు సాగించవచ్చు. అందుకే రైళ్లలో వెళ్లడానికి చాలా మంది మొగ్గు చూపుతుంటారు. అందుకే ప్రయాణికుల భద్రత కోసం ఇండియన్ రైల్వేస్ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే ట్రావెల్ ఇన్సూరెన్స్ ను రైల్వే ఏర్పాటు చేసింది.

ఎవరైనా రోడ్డు ప్రమాదాల్లో చనిపోతే బీమా కవరేజీ అప్లై అవుతుంది. భారతీయ రైల్వే కూడా ఐఆర్సీటీసీ రైలు ప్రయాణికులకు ఇలాంటి బీమానే తెచ్చింది. టికెట్ బుక్ చేసుకునే టైంలో ప్రయాణికులు ఓ ఆప్షన్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే చాలా మంది ఈ బీమా గురించి పట్టించుకోరు. చాలా మంది ప్రయాణికులు ప్రమాదాల గురించి ఎప్పటికప్పుడు అనేక విషయాలు వింటున్నా కూడా బీమా తీసుకోవడం గురించి మాత్రం కొందరు ఆలోచించరు.

ఏదైనా ప్రమాదం జరిగితే ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా కుటుంబానికి అండగా ఉండేది బీమానే అని గుర్తించుకోవాలి. ఈ తరుణంలోనే ఐఆర్సీటీసీ ‘ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ’ పేరుతో రైల్లో ప్రయాణించేవారికి ఓక బీమా సదుపాయాన్ని కల్పించింది. 35 పైసలు చెల్లిస్తే చాలు 10 లక్షల రూపాయల వరకూ బీమాను ప్రయాణికుడు పొందే అవకాశం ఉంటుంది. అయితే రైల్లో ప్రయాణించే సమయంలో ఈ ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుందని తెలుసుకోవాలి.

రైలు ప్రమాదంలో ప్రయాణికుడు మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యం పొందినా రూ.10 లక్షల బీమా పొందే అవకాశం ఉంటుంది. ఒక వేళ పాక్షిక అంగవైకల్యానికి గురైతే రూ.7.50 లక్షల బీమా వర్తిస్తుంది. అలాగే ప్రమాదంలో వారు గాయాలపాలైతే చికిత్స కోసం ఆస్పత్రి ఖర్చులకు రూ.2 లక్షల బీమా వర్తిస్తుందని రైల్వే ప్రకటించింది.