Site icon HashtagU Telugu

Transgender As CHO: జార్ఖండ్‌ ప్రభుత్వ ఉద్యోగిగా తొలి ట్రాన్స్‌జెండర్

Transgender As Cho

Transgender As Cho

Transgender As CHO: జార్ఖండ్‌ ప్రభుత్వంలో మొదటిసారిగా ఒక ట్రాన్స్‌జెండర్‌కు ప్రభుత్వ ఉద్యోగం లభించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పోస్టుల కోసం 365 మంది అధికారులకు నియామక పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం జార్ఖండ్ మంత్రిత్వ శాఖలో నిర్వహించబడింది.మొత్తం 365 మందికి అపాయింట్‌మెంట్ లెటర్‌లు అందజేయబడ్డాయి. అందులో పశ్చిమ సింగ్‌భూమ్ నివాసి అమీర్ మహతో కూడా ఉన్నారు. సిహెచ్ఓ పదవికి నియమితులైన తొలి ట్రాన్స్‌జెండర్ అమీర్ మహతో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

జార్ఖండ్‌లో తొలిసారిగా ఓ ట్రాన్స్‌జెండర్‌ను సీహెచ్‌ఓలో చేర్చారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పదవికి నియామకంపై అమీర్ మహతో సంతోషం వ్యక్తం చేశారు. సిఎం హేమంత్ సోరెన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తన తల్లికి నర్సు కావాలనే కల ఉందని, అయితే ఇంటి ఆర్థిక పరిస్థితుల కారణంగా తాను నర్సు కాలేకపోయానని అమీర్ చెప్పారు.అందుకే నర్సు కావాలనే తన తల్లి కలను నెరవేర్చింది. దీనితో పాటు తాను పాట్నా ఎయిమ్స్‌లో కూడా పనిచేశానని, అయితే తన కుటుంబంతో కలిసి జీవించడానికి పాట్నా ఎయిమ్స్‌లో ఉద్యోగం వదిలి జార్ఖండ్‌కు వచ్చానని ఆమె చెప్పింది.

అమీర్ మహతో రాంచీలోని రిమ్స్ హాస్పిటల్ నుండి బిఎస్సి నర్సింగ్ చదివారు. ఆ తర్వాత సంబల్‌పూర్ నర్సింగ్ కాలేజీలో ఎంఎస్సి నర్సింగ్ చదివింది. తాను ట్రాన్స్‌జెండర్ అని, అయితే ఏ రోజు దేవుడిని నిందించలేదని ఆమె చెప్పారు. దీంతో పాటు సీఎం సోరెన్‌కు కృతజ్ఞతలు తెలిపిన అమీర్.. నన్ను సీహెచ్‌ఓగా నియమిస్తారని ఎప్పుడూ అనుకోలేదు. కాలేజీలో చదివేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదన్నారు. కాలేజీలో అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. తోటి విద్యార్థుల మద్దతు ద్వారా నేను నా చదువును ఇంకా కొనసాగిస్తాను అని తెలిపారు.

Also Read: Vastu Tips: మీ ప్ర‌ధాన ద్వారం ముందు ఈ వ‌స్తువుల‌ను పెట్ట‌కూడ‌దు.. ఆర్థికంగా క‌ష్టాలే..!

Exit mobile version