Site icon HashtagU Telugu

Aditya L1 Spacecraft : భూమికి బైబై చెప్పిన ‘ఆదిత్య-ఎల్1’.. సూర్యుడి దిశగా స్పేస్ క్రాఫ్ట్

Aditya L1 Spacecraft

Aditya L1 Spacecraft

Aditya L1 Spacecraft : సూర్యుడిలో దాగిన సీక్రెట్స్ పై రీసెర్చ్ చేసేందుకు  భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘ఇస్రో’ చేపట్టిన మిషన్‌ ‘ఆదిత్య-ఎల్1’ ప్రయోగంలో ఇంకో కీలక ఘట్టం చోటుచేసుకుంది. సెప్టెంబర్ 2న ఆదిత్య-ఎల్ 1 స్పేస్‌క్రాఫ్ట్‌ను ఇస్రో ప్రయోగించగా. తాజాగా మంగవారం తెల్లవారుజామున దానికి ఇస్రో శాస్త్రవేత్తలు కక్ష్యను పెంచారు.  దీంతో స్పేస్ క్రాఫ్ట్ భూమి కక్ష్యను వదిలిపెట్టి..  సూర్యుడి సమీపంలోని ట్రాన్స్ లాగ్రేంజియన్ పాయింట్ 1 (Trans-Lagrangian Point 1) దిశగా జర్నీని మొదలుపెట్టింది. ఈవివరాలను ఇస్రో ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

Also read : Dream About Shri Ram  : ‘రాముడు కలలోకి వచ్చి నాతో అలా చెప్పాడు’.. బీహార్ మంత్రి సంచలన వ్యాఖ్యలు

ట్రాన్స్ లాగ్రేంజియన్ పాయింట్ 1 ను ఎల్1 పాయింట్‌ అని కూడా పిలుస్తారు. ఇది భూమికి దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. భూమి నుంచి చంద్రుడు ఉన్న దూరానికి ఇది దాదాపు 4 రెట్లు ఎక్కువ. ఆదిత్య-ఎల్ 1 స్పేస్‌క్రాఫ్ట్‌ ఇంకో 110 రోజులపాటు ప్రయాణించి ఎల్1 పాయింట్‌ను చేరుకుంటుంది. ఆ తర్వాత ఇంకోసారి కక్ష్యను పెంచి.. స్పేస్ క్రాఫ్ట్ ను లాగ్రేంజ్ పాయింట్ చుట్టూ ఉన్న కక్ష్యలోకి (Aditya L1 Spacecraft)  ప్రవేశపెడతారు. సూర్యుడికి, భూమికి మధ్య ఉండటం వల్ల  ఎల్1 పాయింట్‌ దగ్గర  గురుత్వాకర్షణ స్థిరంగా ఉంటుంది.