Training Plane Crash: విషాదం.. శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలెట్లు మృతి

మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. నక్సలైట్ ప్రభావిత బాలాఘాట్ జిల్లాలోని కొండ ప్రాంతంలో శనివారం శిక్షణ విమానం (Training Plane Crash) కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు పైలెట్లు మరణించారు.

  • Written By:
  • Publish Date - March 19, 2023 / 07:51 AM IST

మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. నక్సలైట్ ప్రభావిత బాలాఘాట్ జిల్లాలోని కొండ ప్రాంతంలో శనివారం శిక్షణ విమానం (Training Plane Crash) కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు పైలెట్లు మరణించారు. అమేథీలోని ఫుర్సత్‌గంజ్‌లో ఉన్న ఇందిరాగాంధీ నేషనల్ ఫ్లయింగ్ అకాడమీకి చెందిన ట్రైనీ ఎయిర్‌క్రాఫ్ట్ డైమండ్-40 శనివారం మధ్యాహ్నం మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన పైలట్‌, ట్రైనీ పైలట్‌ మృతి చెందారు. ఇందిరా గాంధీ నేషనల్ ఫ్లైట్ అకాడమీకి చెందిన ట్రైనీ ఎయిర్‌క్రాఫ్ట్ డైమండ్-40 వారం క్రితం మహారాష్ట్రలోని గోండియాలో ఉన్న ఇన్‌స్టిట్యూట్ రెండవ శాఖ అయిన విర్సీ విమానాశ్రయానికి వెళ్లింది.

కెప్టెన్ మోహిత్ ఠాకూర్ (హిమాచల్ ప్రదేశ్ నివాసి), ట్రైనీ పైలట్ వి. మహేశ్వరి (గుజరాత్ నివాసి) విమానంతో వెళ్లారు. ఇద్దరూ శనివారం సాధారణ శిక్షణ విమానంలో ఉన్నారు. విమానం మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలోని కిరణ్‌పూర్ అటవీప్రాంతం కొండల వద్దకు రాగానే శనివారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్‌, ట్రైనీ పైలట్‌ ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఇన్‌స్టిట్యూట్ మీడియా ఇన్‌ఛార్జ్ ఆర్‌కే ద్వివేది ప్రమాద విషయాన్ని ధృవీకరించారు. ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన దర్యాప్తు బృందం ఆదివారం బాలాఘాట్‌కు వెళ్తుందని ద్వివేది చెప్పారు. దర్యాప్తు బృందంలో ఉన్న నిపుణులు ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తారు.

Also Read: Earthquake In Ecuador: ఈక్వెడార్‌లో భారీ భూకంపం.. 13 మంది మృతి

బాలాఘాట్ సరిహద్దులోని గోండియా జిల్లాలోని బిర్సీ ఎయిర్ స్ట్రిప్ నుంచి మధ్యాహ్నం 3.06 గంటలకు శిక్షణ విమానం బయలుదేరిందని డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనురాగ్ శర్మ తెలిపారు. అయితే మధ్యాహ్నం 3.11 గంటలకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)తో సంబంధాలు తెగిపోయాయని పేర్కొన్నారు.