Site icon HashtagU Telugu

Shivaji Bridge Station : పట్టాలు తప్పిన రైలు

Nizamuddin To Ghaziabad Tra

Nizamuddin To Ghaziabad Tra

అహ్మదాబాద్ విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash) జరిగిన గంటల వ్యవధిలోనే రైలు ప్రమాదం (Train Accident) జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీలోని శివాజీ బ్రిడ్జి స్టేషన్ (Shivaji Bridge Station) సమీపంలో హజ్రత్ నిజాముద్దీన్ నుంచి ఘజియాబాద్ (Nizamuddin to Ghaziabad) వెళ్లే 64419 రైలు పట్టాలు తప్పింది. రైలులో నాల్గవ బోగీ రైలు ట్రాక్ నుంచి తప్పిపోయింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం తో పాటు ఎవ్వరు గాయపడకపోవడం తో అంత ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఘటన జరిగిన వెంటనే స్పందించిన అధికారులు రక్షణ చర్యలు ప్రారంభించి, ప్రమాదాన్ని సమర్థంగా నివారించారు.

Rohit Sharma: ఇది నిజంగా క‌ల‌వ‌ర‌పెట్టే వార్త‌.. విమాన ఘ‌ట‌న‌పై రోహిత్ శ‌ర్మ ఎమోష‌న‌ల్‌!

ఈ ప్రమాదంతో అటు వైపుగా వెళ్లే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని. పలు రైళ్లు ఆలస్యం కాగా, కొన్ని రైళ్లను దారి మళ్లించారు. రైలు పట్టాలు పునరుద్ధరించేందుకు రెస్క్యూ బృందాలు, ట్రాక్ మెయింటెనెన్స్ సిబ్బంది, సాంకేతిక నిపుణులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదానికి గురైన బోగీని మళ్లీ ట్రాక్‌పై నిలబెట్టేందుకు భారీ క్రేన్లను ఉపయోగించారు. సాయంత్రం వరకూ రేపైరు పనులు పూర్తీ అవుతాయని అధికారులు తెలుపుతున్నారు. రాత్రి నుంచి రైలు సేవలు కొంతవరకు పునఃప్రారంభం కానున్నాయి.

Air india Flight Crash : విమాన ప్రమాదంలో చాలా మంది ప్రయాణికులు మరణించారు: విదేశాంగ శాఖ ప్రకటన

ఉన్నతాధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు ప్రారంభించినట్లు ఉత్తర రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి ట్రాక్ వైఫల్యం, మెకానికల్ లోపం లేదా సిగ్నల్ లోపం కారణం అయ్యుండవచ్చని అనుమానిస్తున్నారు. ప్రయాణికులకు సమాచారం అందించేందుకు ముఖ్య స్టేషన్ల వద్ద ప్రకటనలు చేశారు.