Maharashtra : అవార్డు కార్యక్రమంలో విషాదం, వడదెబ్బతో 11మంది మృతి!

  • Written By:
  • Publish Date - April 17, 2023 / 10:39 AM IST

మహారాష్ట్ర (Maharashtra)ప్రభుత్వం అవార్డు కార్యక్రమంలో విషాదం నెలకొంది. ఈ కార్యక్రమానికి హాజరైన వేలాది మంది మండుటెండల్లో కూర్చోవల్సి వచ్చింది. వేలాదిగా తరలివచ్చిన వారంతా ఎండలోనే కూర్చున్నారు. దీంతో వందలాది మందికి వడదెబ్బ తగిలింది. 11మంది మరణించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 6వందల మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిని సమీప ఆసుపత్రికి తరలించారు. రాయ్ గడ్ జిల్లా కలెక్టర్ 11 మంది మరణించినట్లు తెలిపారు.

మహారాష్ట్ర సర్కార్ ఈ అవార్డు ప్రదాన కార్యక్రమాన్ని నిర్వహించింది. నవీ ముంబైలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి అమిత్ షా కూడా హాజరై అవార్డులను ప్రదానం చేశారు. ఆ రోజు ఉష్ణోగ్రత 38 డిగ్రీలు నమోదుఅయ్యింది. వేలాది మంది కార్యక్రమానికి తరలివచ్చారు. కానీ వారికి కావాల్సిన కనీస అవసరాలనుకూడా ఏర్పాటు చేయలేదు. తాగేందుకు నీరు దొరకపోవడంతో జనాలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కేవలం వీఐపీల కోసమే టెంట్లు వేశారు. ఈ కారణంగా జనాలు డీహైడ్రేషన్ కు గురయ్యారు. కళ్లు తిరిగి కిందపడిపోయారు. తొక్కిసలాట పరిస్థితి ఏర్పడింది.

ఆదిత్య ఠాక్రే, ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఎంజీఎం కమోతే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఆసుపత్రిలోని డాక్టర్‌తో కూడా మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. కొంతమంది రోగులు కోలుకున్న తర్వాత ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారని, మరికొందరు ఇప్పటికీ ఆసుపత్రుల్లో, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని పోలీసు అధికారి తెలిపారు. సిఎంఓ విడుదలకు ముందు, సిఎం షిండే నవీ ముంబైలోని ఆసుపత్రి వెలుపల విలేకరులతో మాట్లాడుతూ, కనీసం 50 మంది ఆసుపత్రిలో చేరారని, వారిలో 24 మంది ఇప్పటికీ చేరారని, మిగిలిన వారు ప్రథమ చికిత్స తర్వాత అక్కడ ఉన్నారని చెప్పారు. ఈ మరణాలు చాలా దురదృష్టకరమని ఆయన అన్నారు.

మృతుల బంధువులకు ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని షిండే తెలిపారు.